చాలామంది ఏదో ఒక సమయంలో డిప్రెషన్‌కు గురవుతుంటారు. అయితే దీని ప్రభావం పురుషులకంటే మహిళలల్లోనే అధికంగా ఉంటుందని జన్యు పరిశోధనలో వెల్లడైంది. ఆస్ట్రేలియాకు చెందిన క్యూఐఎంఆర్ బెర్గ్ హోఫర్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని నిర్ధారించింది. మహిళలు, పురుషులు డిప్రెషన్‌ను అనుభవించే విధానంలో ఉన్న జన్యు వ్యత్యాసాలను గుర్తించింది. ఈ పరిశోధన మేరకు మహిళల డీఎన్ఏలో డిప్రెషన్‌కు సంబంధించిన జన్యు ఫ్లాగ్‌లు లేదా సంకేతాలు పురుషుల కంటే రెండింతలు ఎకువగా ఉన్నాయని తేలింది. సుమారు 13,000 డీఎన్ఏ మార్పులను గుర్తించిన పరిశోధక బృందం.. వీటిలో పురుషులు, మహిళల్లో కలిపి 7,000 మార్పులను గమనించారు. మరో 6,000 మార్పులు కేవలం మహిళల్లోనే ఉన్నట్లు వెల్లడయ్యాయి.
ఈ అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు, పురుషుల డీఎన్ఏలను విశ్లేషించగా 1.30 లక్షల మహిళలు, 65 వేల పురుషులు మానసిక కుంగుబాటుతో సతమతమవుతున్నారని గుర్తించారు. డిప్రెషన్ ఉన్న మహిళల్లో జీవక్రియల్లో, బరువులో మార్పులు గమనించారు. అంతేకాదు వారి శక్తి స్థాయులు కూడా గణనీయంగా తగ్గాయట. ఇప్పటివరకు ఎకువ మందుల ప్రయోగాలు, థెరపీ పరీక్షలు పురుషులపైనే జరగడం వల్ల మహిళా రోగులపై సరైన అవగాహన లేదని, ఈ పరిశోధనతో భవిష్యత్తులో మహిళల మానసిక ఆరోగ్యానికి ప్రత్యేక చికిత్సలు, థెరపీలు రూపుదిద్దుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.