పండుగలు, శుభకార్యాలకు సంప్రదాయ దుస్తులనే ఇష్టపడతాం. అలా అని అన్ని వేడుకలకూ పట్టుచీరలు కట్టుకోలేం కదా! మెహందీ, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాల్లో సంప్రదాయం ప్లస్ స్టయిలిష్ దుస్తులే నప్పుతాయి. ఆ ట్రెడిషనల్ ట్రెండీ డిజైన్లేంటో చూద్దాం..
జార్జెట్ జతగా..
ప్రింట్ విత్ ప్రింట్ కాన్సెప్ట్‌తో.. సెల్ఫ్ సీక్వెన్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ప్రయోగమిది. చీతా ప్రింట్ ఫ్యాబ్రిక్‌తో లెహంగాతోపాటు క్రాప్‌టాప్ జోడించారు. లెహంగాకు సర్క్యులర్ కట్తోపాటు డబుల్ గేరా ఇచ్చారు. అదే ప్రింట్‌తో ఫుల్ స్లీవ్స్, స్కేర్ నెక్‌తో ఇచ్చిన క్రాప్‌టాప్ హైలైట్ అయ్యింది. నడుము భాగంలో ఇచ్చిన కర్వ్ షేప్ వల్ల లుక్ అదిరింది. అదే ఫ్యాబ్రిక్‌తో మిడిల్ పార్ట్‌లో గతేర్స్తో డిజైన్ చేసిన దుపట్టా అదనపు ఆకర్షణ.
ఎవర్గ్రీన్ పింక్..
మగువలు మనసుపడే రంగుల్లో గులాబీదే పైచేయి. వైట్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై పింక్ అండ్ గ్రీన్ ఫ్లోరల్ ప్రింట్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. ఆకులు, పువ్వులు, తీగలతో కలర్ఫుల్గా ఉన్న డిజిటల్ ప్రింట్.. వైట్ కలర్‌పై హైలైట్ అయ్యింది. బౌన్సీ లుక్ కోసం అదే ఫ్యాబ్రిక్‌పై మూడు లేయర్లలో ప్రిల్స్ ఇచ్చి బార్డర్ పీకో చేశారు. లెహంగాకు కాంట్రాస్టింగ్‌గా ఎరుపు నిండిన గులాబీ రంగు క్రాప్‌టాప్ ఇచ్చారు. ఫుల్నెక్, స్లీవ్‌లెస్ హ్యాండ్స్‌తో టాప్కు ట్రెండీ లుక్ వచ్చింది. లెహంగా ఫ్యాబ్రిక్‌తో చేతులకూ టాప్ మధ్యలో చిన్న పట్టీలా ప్రిల్స్ జతచేశారు. లెహంగాకు నప్పేలా డిజైన్ చేసిన దుపట్టా, ఫ్లోరల్ ప్రింట్ హ్యాండ్‌మేడ్ జువెలరీ అదనపు ఆకర్షణ.
-రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335