e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిందగీ ఇంట్లోనూ మాస్క్‌

ఇంట్లోనూ మాస్క్‌

కరోనా వైరస్‌ గాలిలోనూ ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందనీ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, బయటికి వెళ్లినప్పుడే కాకుండా, ఇంట్లోనూ మాస్క్‌ ధరించాలని వారు సూచిస్తున్నారు. అయితే, 24 గంటలూ మాస్క్‌ పెట్టుకోవడం కష్టమంటారా? మరీ అంత ఇబ్బందిగా ఉంటే, ప్రత్యేక సందర్భాల్లోనైనా కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.

ఇంట్లోనూ మాస్క్‌
  • ఇంట్లో ఎవరికైనా దగ్గు, తుమ్ములు తదితర లక్షణాలు ఉన్నట్లయితే ఇంటిల్లిపాదీ కొన్ని రోజులు తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలి.
  • కుటుంబసభ్యుల్లో ఒక్కరికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తినా కుటుంబసభ్యులంతా మాస్క్‌ ధరించాల్సిందే!
  • ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లకు కేర్‌ టేకర్‌గా ఉన్నవాళ్లు కూడా రోజంతా మాస్క్‌ పెట్టుకోవడమే మంచిది.
  • ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే, ఆ వచ్చిన వారినీ తప్పకుండా మాస్క్‌ ధరించమని చెప్పాలి. అలాగే ఇరుగు పొరుగుతో మాట్లాడేటప్పుడు కూడా మాస్క్‌ తప్పనిసరి.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంట్లోనూ మాస్క్‌

ట్రెండింగ్‌

Advertisement