కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: ఒక కప్పు, కారం: రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి ముద్ద: ఒక టీస్పూన్, వాము: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, ధనియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమపిండి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, వాము, పసుపు, ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు పోసి పిండిని చపాతీ ముద్దలా కలిపి మూతపెట్టి పది నిమిషాలపాటు పక్కనపెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచెయ్యాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చిన్న పూరీల్లా ఒత్తుకుని నూనెలో వేసి.. దోరగా కాల్చుకుంటే వేడివేడి మసాలా పూరీలు సిద్ధం.