ఇప్పుడు విస్తరించిన అపార్ట్మెంట్ కల్చర్‌లో.. ఇంటీరియర్ ప్లాంట్స్‌తో ఇంటిని నందనవనంగా మార్చేస్తున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి.. బోన్సాయ్ మొక్కలకు చోటిచ్చి… ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ చిట్టి చెట్లు.. ఇంట్లో ప్రశాంతత, పచ్చదనంతోపాటు గృహానికి జీవకళను తీసుకొస్తాయి.