సోషల్ మీడియాలో చాలామంది ఫొటోలు షేర్ చేస్తుంటారు. పైగా వాటిని ఎడిటింగ్ టూల్స్‌లో చూడ చక్కగా తీర్చిదిద్దుతారు. ప్రొఫైల్ పిక్చర్ విషయంలో అయితే మరింత పర్టిక్యులర్‌గా ఉంటారు. మీరూ అదే కోవకు చెందుతారా? అయితే, ‘ఫేస్బుక్ ఫ్రేమ్ స్టూడియో’ను ట్రై చేయండి. ఎఫ్బీలో ప్రొఫైల్ పిక్‌ను మార్చడానికి ఇదో చక్కని ఆప్షన్. ఈ టూల్ ఉపయోగించడం అంత కష్టం కూడా కాదు! ముందుగా ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్లోకి వెళ్లాలి.
తర్వాత ప్రొఫైల్ పిక్చర్‌ను ట్యాప్ చేసి ‘యాడ్ ఫ్రేమ్’ ఆప్షన్ ఎంచుకోవాలి! అప్పుడు ఫ్రేమ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. అక్కడ కొత్త ఫ్రేమ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ ప్రారంభించడానికి ముందు పీఎన్జీ ఫార్మాట్ ఫొటో ఎంపిక చేసుకోవాలి. ఆ ఫొటో సైజు 1 ఎంబీ కన్నా తక్కువగా ఉండాలి. ఆ ఫొటోను ఫ్రేమ్ స్టూడియోకి అప్లోడ్ చేయాలి.
తర్వాత ఫ్రేమ్ స్టూడియో టూల్స్‌ను ఉపయోగించి కస్టమ్ ఫ్రేమ్‌ను ప్రొఫైల్ పిక్చర్‌కు సెట్ చేసుకోవచ్చు. దీనికి నచ్చిన క్యాప్షన్లు, లోగోలు, గ్రాఫిక్స్ కూడా జోడించవచ్చు. డిజైన్ ఓకే అనిపించాక, ప్రివ్యూ చూసుకొని.. అవసరమైతే మళ్లీ ఎడిటింగ్ చేయొచ్చు. డిజైనింగ్ పూర్తయ్యాక ‘పబ్లిష్’ చేసుకోవచ్చు. తర్వాత కెమెరా బటన్ ట్యాప్ చేసి ఫ్రేమ్స్ ట్యాబ్‌లోకి వెళ్లి, క్రియేట్ చేసుకున్న డిజైన్‌ను సెలెక్ట్ చేస్తే చాలు. ఎఫ్బీ వాల్‌పై కస్టమైజ్డ్ ఫ్రేమ్‌తో ప్రొఫైల్ పిక్చర్ ప్రత్యక్షమవుతుంది.