Srinidhi Shetty | కేజీఎఫ్‌లో నరాచీ సామ్రాజ్యానికి రాఖీభాయ్ కింగ్ అయితే, ఆయన సరసన రీనాగా నటించిన శ్రీనిధి శెట్టి కుర్రకారు కలల క్వీన్. అందచందాలతో, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్నది. తన చూపులతో మాయచేసే శ్రీనిధి, ఎదుటి వ్యక్తిలో ముందుగా కండ్లనే చూస్తానని చెబుతున్నది. ఇంకా మరెన్నో ప్రశ్నలకు ఫటాఫట్ అన్నట్టు జవాబిచ్చింది.
మీ డ్రీమ్ రోల్?
ఒకటని కాదు. అన్ని రకాల పాత్రలూ పోషించాలని ఉంది.
అభిమానించే నటీనటులు?
యశ్, విక్రమ్, బాలీవుడ్ నటి మధుబాల
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ గురించి మీ అభిప్రాయం?
ఓటీటీని డిజిటల్ విప్లవంగా చెప్పొచ్చు. దీని కారణంగా ఎందరో కళాకారులకు, నిపుణులకు అవకాశాలు వస్తున్నాయి.
మీ హ్యాండ్‌బ్యాగ్‌లో కచ్చితంగా ఉండే వస్తువులు?
ఫోన్ చార్జర్, లిప్ బామ్, మాయిశ్చరైజింగ్ క్రీమ్. నాది డ్రై స్కిన్, ఏది మర్చిపోయినా మాయిశ్చరైజర్ మాత్రం ఉండాల్సిందే!
యోగా, జిమ్.. ఏది ఫేవరెట్?
జిమ్. భారీ కసరత్తులు చేయననుకోండి.
భారతీయ వంటకాలు ఇష్టమా, విదేశీ రుచులా?
మన వంటకాలంటేనే ఇష్టం.
ఎప్పటికీ మర్చిపోలేని బాల్య జ్ఞాపకం?
అమ్మతో గడిపిన ప్రతిక్షణం నాకు అపురూపమే!
పేరు ప్రఖ్యాతులు కావాలా? డబ్బు కావాలా?
నాకు మాత్రం డబ్బే కావాలి.
మీ ఫస్ట్ లవ్?
ఎవరికైనా అమ్మే!
ఎదుటి వ్యక్తిలో మీరు మొదటగా గుర్తించేది ఏమిటి?
కండ్లు. చూడగానే ఓ అభిప్రాయానికి వచ్చేస్తా.
రాజకీయాలు, మతం, వ్యాపారం, క్రీడలు, ఎంటర్టైన్మెంట్.. వీటిలో మీకు ఇష్టమైనవి?
ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్.
మీ దృష్టిలో సంపూర్ణమైన మనిషి అంటే..
ఎదుటి వ్యక్తుల అభిప్రాయాలను గౌరవించాలి. తోటివారిని అర్థం చేసుకోవాలి.
పర్ఫెక్ట్ డేట్ అంటే ఎలా ఉండాలనుకుంటారు?
మామూలుగా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. తీరిగ్గా కూర్చొని రకరకాల రుచులు ఆస్వాదించాలి. మంచి సినిమా చూస్తూ కాలం గడపాలి.
Srinidhi Shetty | ఆ జాబితా పెద్దదే అంటూ సీక్రెట్ బయటపెట్టిన శ్రీనిధి శెట్టి
“Srinidhi Shetty | ట్రెడిషనల్ డ్రెస్‌లో పిచ్చెక్కించిన శ్రీనిధి శెట్టి..”
Srinidhi Shetty | కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి స్టన్నింగ్ స్టిల్స్..”