‘సైజ్ జీరో’తో బీటౌన్ మొత్తాన్నీ తనవైపు తిప్పుకొన్న బ్యూటీ.. కరీనా కపూర్. అందం, అభినయం నిండుగా ఉన్న టాప్ హీరోయిన్! బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ మనవరాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. సైఫ్ అలీఖాన్‌తో పెళ్లి, ఇద్దరు పిల్లలకు తల్లి అయినా.. నటనకు మాత్రం దూరం కాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నది. ఓవైపు షూటింగ్‌లు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నది.
తాజాగా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ‘ఒకే రోజు.. వేర్వేరు సెట్లు.. వేర్వేరు నగరాలు. మీరు చూస్తున్నట్టుగానే.. కష్టపడి పనిచేసే జీవితాలు!’ అంటూ రాసుకొచ్చింది. ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోల్లో.. మెరూన్ రంగు షర్ట్‌పైన నల్ల ప్యాంటు వేసుకొని, పోలీస్ బెల్ట్ ధరించి ఓ ఆఫీసర్‌గా పోజులిచ్చింది కరీనా. మరోవైపు సైఫ్ అలీఖాన్ వైట్ షర్ట్, బ్లూ జీన్స్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నాడు.
వాటికిందే.. ‘పోలీస్ పాత్ర పోషించాను. నా భర్త తన అందానికి దోషిగా తేలాడు’ అంటూ క్యాప్షన్ పెట్టింది కరీనా. ఈ ఏడాది ప్రారంభంలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్.. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో జైపూర్‌లోని మాండవాలో గుర్రపు స్వారీ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సైఫ్ అభిమానులు.. తమ హీరో కోలుకొని, మళ్లీ షూటింగ్స్‌కు సిద్ధమవుతుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.