e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home జిందగీ కోమలికి..నెమలి డిజైన్లు!

కోమలికి..నెమలి డిజైన్లు!

మయూరం సౌందర్య చిహ్నం. పురివిప్పిన నెమలి అందానికే అందం. చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తుందా వయ్యారం. ఆ వగలన్నీ నగల్లో బంధిస్తే? అద్భుతమైన ఆభరణాలు సృష్టిస్తే? ఇక, అందరి దృష్టీ ఆమె మీదే. ప్రాచీన కాలంనుంచీ నెమలి అందాలను కిరీటాలకు, సింహా సనాలకు, హారాలకు జోడిస్తూనే ఉన్నారు. రంగురాళ్లు, ముత్యాలు, పూసలు.. మయూర ఆభరణాలకు మరింత వన్నె తెస్తున్నాయి.సంప్రదాయ వేడుకల్లో పట్టుచీరలతో కలసి కనికట్టు చేస్తున్నాయి. నెమలి సొబగుల హారాలు, చోకర్లు, జుంకాలు అలంకరించుకొనేందుకు ఆధునిక మహిళలు మక్కువ చూపుతున్నారు.

పురివిప్పిన నెమలి స్త్రీ హృదయ సౌందర్యానికి
ప్రతీక. అందుకేనేమో, ఆ స్ఫూర్తితో డిజైన్‌ చేసిన రంగురంగుల చీరలు, డ్రెస్సులు మహా ఇష్టంగా ధరిస్తుందామె. నెమలి పింఛమే ఆదివాసీ మహిళ తొలి అలంకరణ సామగ్రి. తాజాగా నెమలి పింఛపు కంఠాభరణాలు, జుంకాలు ఆధునిక ఫ్యాషన్‌లో భాగం అయ్యాయి. వెస్ట్రన్‌వేర్‌పైనా అతికినట్టు సరిపోవడం వీటి ప్రత్యేకత.

- Advertisement -

రాళ్ల మేళవింపుతో..
నెమలి నమూనాలో రూపుదిద్దుకునే నగలలో రంగు రాళ్లదే హంగూ ఆర్భాటం. పచ్చలు, కెంపులు అదనపు అందాన్నిస్తాయి. జడబిళ్లలు, ఉంగరాలు, హారాలు, చోకర్లలో నెమలి డిజైన్‌ మరీ బాగుంటుంది. మంగళ సూత్రం బిళ్లలు, పొడవైన పూసల హారాల పెండెంట్లకు తిరుగులేని ఎంపిక.. నెమలి డిజైన్‌. పురివిప్పిన నెమలి ఆకారానికి రంగురంగుల రాళ్లను పొదిగి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు స్వర్ణకారులు. పెద్దపెద్ద ఉంగరాలకూ నెమలి పింఛం డిజైన్లనే ఇష్టపడతారు అతివలు.

ఆధునిక హంగులతో..
ఫ్యాషన్‌కు తగినట్టు ఫ్యాబ్రిక్‌, సిల్క్‌, త్రెడ్‌ జువెలరీలోనూ నెమలి అందాలను మేళవిస్తున్నారు స్వర్ణకారులు. ముఖ్యంగా రాజస్థానీ టెర్రకోటా ఆభరణాల్లో నెమలి రంగులు అద్దిన నగలు సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ఆధునికతనూ రంగరించుకున్నాయి. ధర కూడా అందుబాటులో ఉండటంతో, బంగారం పట్ల మమకారాన్ని పక్కనపెట్టి మరీ, వీటివైపే మొగ్గు చూపుతున్నారు.

అదే అందం..
దాదాపు అన్ని ఆభరణాలూ నెమలి సొబగులతో లభిస్తున్నాయి. పాపిటబిళ్ల నుంచి కాలిపట్టాల వరకూ వీటి హొయలుకు దాసోహం అంటున్నారు అతివలు. నిండైన రంగులతో కనిపించే నెమలి పింఛం పెండెంట్లు, ఉంగరాలు కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేవారికి రోజూవారీ ఆభరణాలుగా పనికొస్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement