జమ్‌తార (హిందీ వెబ్ సిరీస్ సీజన్-2) నెట్‌ఫ్లిక్స్- సెప్టెంబర్ 23
తారాగణం: అమిత్ సియాల్, స్పర్శ్ శ్రీవాస్తవ్, మోనికా పన్వర్, దిబ్యేందు భట్టాచార్య, ఆసిఫ్‌ఖాన్.
దర్శకత్వం: సౌమేంద్ర పాధీ
ఆన్లైన్, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే బ్యాంక్ ఫ్రాడ్స్ అనగానే తొలుత గుర్తొచ్చే పేరు ‘జమ్‌తార’. జార్ఖండ్ రాష్ట్రంలోని ఈ మారుమూల పట్టణం ఆన్లైన్ ఆర్థిక నేరాలకు అడ్డాగా మారిన వైనంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో రెండేండ్ల కిందట వచ్చిన ‘జమ్‌తార’ తొలి సీజన్ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. అంతగా చదువుకోని సాధారణ యువత తమ మాయమాటల ద్వారా జనాల్ని బురిడీ కొట్టించి, సాంకేతికత అస్త్రంగా ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని నడిపే తీరును తొలి సీజన్ కళ్లకు కట్టింది.
దాంతో‘జమ్‌తార’ సీజన్-2 కోసం ప్రేక్షకులు ఉత్సుకతతో ఎదురుచూశారు. రెండో సీజన్లో
‘జమ్‌తార’ నేర ప్రపంచాన్ని మరింత లోతుగా ఆవిష్కరించారు. ఫిషింగ్ ఫ్రాడ్స్ నుంచి ‘జమ్‌తార’ గ్యాంగ్ ఏకంగా రాజకీయాల్లో అడుగుపెడుతుంది. పట్టణాన్ని తమ అదుపులో ఉంచుకుంటుంది. ఆన్లైన్ మోసాల కోసం కొత్తదారుల్ని వెతుక్కుంటారు జమ్‌తార యువకులు. డేటింగ్ యాప్స్, ఫేక్ లాటరీ కాల్స్, కౌన్ బనేగా కరోడ్‌పతి స్కామ్ ద్వారా పెద్ద
మొత్తంలో ఆన్లైన్ లూటీలకు పాల్పడుతుంటారు. డీమాని
టైజేషన్ సమయాన్ని ఎంచుకోవడంతో కావాల్సినంత డ్రామాను క్రియేట్ చేయగలిగారు. సీజన్ 2లో ఎన్నో కొత్త పాత్రల్ని పరిచయం చేశారు. తొలిభాగంతో పోలిస్తే రెండో సీజన్లో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.