తప్పు చేస్తున్నానా?
నా వయసు పందొమ్మిది. ఇంజినీరింగ్ చదువుతున్నా. మా పిన్ని కొడుకు వయసు పదిహేడు. పిన్ని అంటే అమ్మ చెల్లె కాదు. దూరపు చుట్టం. ఆమె కొడుకు, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మా ఇద్దర్నీ చూసి చాలామంది కుళ్లుకుంటారు
నా వయసు పందొమ్మిది. ఇంజినీరింగ్ చదువుతున్నా. మా పిన్ని కొడుకు వయసు పదిహేడు. పిన్ని అంటే అమ్మ చెల్లె కాదు. దూరపు చుట్టం. ఆమె కొడుకు, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మా ఇద్దర్నీ చూసి చాలామంది కుళ్లుకుంటారు. ఎందుకో, నాకే తెలియకుండా తన పట్ల ఆకర్షణ ఏర్పడింది. ఏవేవో ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా వాటిని వదిలించుకోలేక పోతున్నా. నాపై నాకే అసహ్యం వేస్తున్నది. అపరాధ భావం వెంటాడుతున్నది. – ఓ సోదరి
దూరపు బంధువు అయినా, దగ్గరి చుట్టమైనా.. అతను తమ్ముడి వరస అవుతాడు. వయసులోనూ మీకంటే చిన్నవాడే. తనను సోదరుడిలా ఆదరించండి. స్నేహితుడిగా మీ మనసులో స్థానం ఇవ్వండి. అంతకు మించిన ఆలోచనలు వద్దు. మీ మనసులోని అపరాధ భావననూ తొలగించుకోండి. మీలోని విజ్ఞత మీ మాటల్లో వ్యక్తం అవుతున్నది. మీది ఆకర్షణే. ప్రేమ కాదు. పెద్దగా స్నేహితులు లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. మీ ఆలోచనలను కెరీర్ వైపు మళ్లించండి. ఇంజినీరింగ్ తర్వాత ఏం చదవాలనే దానిపై ఫోకస్ చేయండి. చదువులకు ఇబ్బంది లేకుండా.. కొత్త పరిచయాలను, స్నేహాలను పెంచుకోండి. అర్థంలేని ఆలోచనలను వడపోసే శక్తి ధ్యానానికి ఉందని చెబుతారు నిపుణులు. మీరూ ప్రయత్నించి చూడండి. జీవితం సుదీర్ఘమైంది. ఏదో ఓ మజిలీ దగ్గర మనం ఆగిపోకూడదు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

