స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి మరో కొత్త భారతీయ బ్రాండ్ ఎంటరైంది. బెంగళూరుకు చెందిన ఇండ్కల్ టెక్నాలజీస్ సంస్థ.. తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. అనేక అత్యాధునిక ఫీచర్లతో ‘వోబుల్ వన్’కు రూపకల్పన చేసింది. ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ కలిగిన 6.67 అంగుళాల ఫుల్హెచ్డీ, AMOLED డిస్ప్లేను ఏర్పాటుచేశారు డిజైనర్లు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్.. 2.6GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. 8జీబీ/12జీబీ ర్యామ్‌తో.. ఫోన్ మరింత స్మూత్‌గా పనిచేస్తుంది.
ఇందులో కొత్తగా ఎపిక్హైపర్ గేమింగ్ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. ఎంతటి హై డెఫినేషన్ గేమ్స్ ఆడినా.. ఎలాంటి ల్యాగ్ ఉండదు. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వెనుక వైపున 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సర్‌ను అమర్చారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను అందిస్తుంది. అంటే ఫొటోలు, వీడియోలు తీసినప్పుడు ఫోన్ షేక్ అయినా.. ఫొటోలు చాలా క్లియర్‌గా వస్తాయి. బొకే కొసం.. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్‌ను అందిస్తున్నారు.
ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనే ఉన్నది. అంతర్గతంగా చాలా శక్తిమంతంగా తయారైన ఈ స్మార్ట్‌ఫోన్.. బయటినుంచి చూసేందుకు మరింత అందంగా కనిపిస్తుంది. అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో తయారు చేయడంతోపాటు గ్లాస్ రియర్ ప్యానెల్‌ను ఏర్పాటుచేశారు. కేవలం 7.8 మి.మీ. మందంతో చేతిలో ఇట్టే ఒదిగిపోతుంది. డాల్బీ ఆట్మస్తో అద్భుతమైన సౌండ్ క్వాలిటీ అందిస్తుంది. ఆండ్రాయిడ్-15తో నడిచే వోబుల్ వన్ ఫోన్.. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ బేస్ వేరియంట్‌తో తయారైంది. దీనితోపాటు 8జీబీ-256జీబీ; 12జీబీ-256జీబీ వేరియంట్లలోనూ లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి.. ధర రూ.22,000 నుంచి ప్రారంభం కానుండగా, డిసెంబర్లో అమెజాన్ వేదికగా అమ్మకానికి రాబోతున్నది.