India circus | ఇంటి అలంకరణలో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. తాజాగా ‘ఇండియా సర్కస్’ అనే కంపెనీ వినూత్నమైన వస్తువులతో అందరినీ ఆకట్టుకుంటున్నది. వైవిధ్యమైన గృహాలంకరణ వస్తువులను మార్కెట్లోకి తీసుకొస్తున్నది. వాటిలో, పాలీ రెజిన్తో చేసిన సింహం, జాగ్వర్, ఒంటె, నీటి ఏనుగు, ఏనుగు మొదలైన జంతువుల బొమ్మలు మరీ ట్రెండీగా ఉన్నాయి. వీటి ధరలు రూ.1000 నుంచి రూ.4000 వరకూ ఉన్నాయి.