భారతీయ సూపర్ ఫుడ్‌లలో మునగది ప్రత్యేక స్థానం. మునగాకుతో పప్పు, కాయలతో సాంబార్, కూరలు పసందుగా వండుకుంటారు. రుచిలో తనకు సాటి లేదనిపించే మునగ ఆరోగ్యాన్ని అందించడంలోనూ మేటి అనిపించుకుంది. మన జుట్టు పెరుగుదలకు మునగ ఔషధంలా పనిచేస్తుంది. మునగాకును పొడిగా గానీ, కషాయంగా గానీ తీసుకుంటే.. జుట్టుకు పోషకాలు పుష్కలంగా అందుతాయి. జుట్టు పెరుగుదలకు మునగలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్ ఎంతగానో తోడ్పడతాయి.
ప్రతిరోజూ ఉదయం తాగే వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ మునగ పొడిని జోడించండి. మరింత హైడ్రేటింగ్‌గా కావాలంటే మునగ రసాన్ని ఎంచుకోవడం ఉత్తమం. దీనిని తాజా మునగ ఆకులతో చేసుకోవచ్చు. అందులో కాస్త తేనె, ఉసిరి రసం కలుపుకొని తాగితే టేస్టీగా ఉంటుంది. మునగాకు జ్యూస్ యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్లు తొలగిపోతాయి. ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు జుట్టు పెరుగుదలలో కూడా మెరుగైన ఫలితాలనిస్తుంది.