HomeZindagiHow Do We Press The Reset Button In Relationships
Life Style | బీటలుబారిన అనుబంధాల్ని పట్టాలకు ఎక్కించాలంటే?
ప్రతి వ్యవస్థకూ ఓ రీసెట్ బటన్ ఉంటుంది. అలాంటి మీటే మన బంధానికి మాత్రం ఎందుకు ఉండకూడదు? బీటలుబారిన అనుబంధాల్ని పట్టాలకు ఎక్కించేందుకు ఆ బటన్ను ఎందుకు ఉపయోగించకూడదు? కావాలంటే, ప్రయత్నించి చూడమంటున్నారు నిపుణులు...
Life Style | ప్రతి వ్యవస్థకూ ఓ రీసెట్ బటన్ ఉంటుంది. అలాంటి మీటే మన బంధానికి మాత్రం ఎందుకు ఉండకూడదు? బీటలుబారిన అనుబంధాల్ని పట్టాలకు ఎక్కించేందుకు ఆ బటన్ను ఎందుకు ఉపయోగించకూడదు? కావాలంటే, ప్రయత్నించి చూడమంటున్నారు నిపుణులు…
ఎదుటపడిన ప్రతిసారీ గొడవపడటం కంటే.. కొన్నాళ్లు భాగస్వామికి దూరంగా ఉంటూ, ఎక్కడ తప్పు జరిగిందో నింపాదిగా విశ్లేషించుకునే ప్రయత్నం చేయండి.
గతంలో జరిగిన పొరపాట్ల గురించి ఆలోచిస్తూ, ఆరోపిస్తూ కూర్చుంటే లాభం లేదు. అలాగని గతాన్ని మర్చిపోదామని అనుకున్నా కుదరదు. ఇద్దరూ కూర్చుని, ఎవరు ఏ సందర్భంగా, ఎందుకు బాధపడ్డారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. గాయం కొంత మానుతుంది. ఆ అధ్యాయం అక్కడితో ముగుస్తుంది.
గత అనుభవాలను హృదయపూర్వకంగా గుర్తిస్తూ, క్షమిస్తూ పోవాలి. భవిష్యత్తులో భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
పొద్దున్నే ఇద్దరూ కలిసి ఓ కప్పు కాఫీ, ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ గుప్పెడు పూలు, ప్రతి సందర్భానికి ఓ చిన్న బహుమతి… ఇవే బంధాన్ని అనుబంధంగా మారుస్తాయి.
భాగస్వామిని నిందించడం, తనలో తప్పులు వెతకడం తేలికే. మరి మన సంగతేమిటి. మనలోనూ వ్యక్తిత్వ లోపాలు ఉండొచ్చు. వాటిని గుర్తించి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి.