రండి రండి పెట్స్‌తో దయచేయండి

కరోనా నేపథ్యంలో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా హోటల్ బిజినెస్ డీలా పడింది. ఈ నేపథ్యంలో అతిథులను ఆహ్వానించే క్రమంలో కొత్తకొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి స్టార్ హోటల్స్ యాజమాన్యాలు. ఈ క్రమంలో ‘పెట్కేషన్’కు తలుపులు తెరిచాయి. అంటే అతిథులు తమ పెంపుడు జంతువులతో సహా హోటల్లో బస చేయవచ్చన్నమాట. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలు, పర్యాటక కేంద్రాల్లోని ఫైవ్‌స్టార్ హోటళ్లు ‘పెట్కేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఇంతకు ముందు పెట్స్‌కు అనుమతించే హోటళ్లు అరుదుగా ఉండేవి. గత్యంతరం లేక పెట్స్ ఉన్నవాళ్లు ఫ్యామిలీ టూర్‌కు వెళ్లాల్సి వస్తే ప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్లనో, పిల్లికూననో పక్కింట్లో అప్పజెప్పాల్సి వచ్చేది. ‘పెట్కేషన్’ ఆ సమస్యను దూరం చేస్తున్నది. యజమానులు వెంట హోటల్‌కు వచ్చిన పెట్స్‌కు ప్రత్యేక బస కల్పిస్తున్నాయి హోటళ్లు. అవి స్వేచ్ఛగా తిరిగే ఏర్పాట్లూ చేస్తున్నాయి. వాటిని ఆడించడానికి ఉద్యోగులను నియమిస్తున్నాయి. రుచికరమైన ఆహారం అందిస్తున్నాయి. అందుకోసం షెఫ్‌లను నియమిస్తున్నాయి కూడా! ఐటీసీ, తాజ్, మారియట్ వంటి బడా హోటళ్లు అతిథులకు ‘పెట్కేషన్’ ఆఫర్ చేస్తున్నాయి. వారి బిజినెస్ ఈక్వేషన్స్ మాట అటుంచితే, పెంపుడు జంతువులకు స్టార్ హోటల్స్‌లో బసచేసే యోగం పట్టింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- corona pandemic
- Hotel
- pets
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

