ఏ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో తింటే మనం నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాం. అందులోనూ ఈ చలికాలంలో కాసే నారింజ పండ్లు నాలుగు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అవేంటో తెలుసుకుంటే వాటిని మరింత ప్రేమగా లాగించేయొచ్చు!

విటమిన్-సి కావాలంటే నారింజలు తినాలి అన్నంతగా ఆ విటమిన్‌కు పేరు మోశాయీ పండ్లు. రోగనిరోధక శక్తిని పెంచి, గుండె జబ్బులు, క్యాన్సర్‌లాంటి వ్యాధుల నివారణకు తోడ్పడుతుందిది. శరీరం నిస్సారం కాకుండా కాపాడుతుంది.
ఇందులోని హెస్పెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ రక్తపోటును నియంత్రిస్తూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహకరిస్తుంది. నారిజెనిన్ అనే ఫ్లేవనాయిడ్ శరీరంలోని యాంటి ఆక్సిడెంట్ల స్థాయులను నియంత్రిస్తుంది.
ఈ పండుకు నిండైన రంగును ఇచ్చే కెరాటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నారింజల్లో అధిక మోతాదులో పీచులు దొరుకుతాయి. ఇవి మలబద్ధకాన్ని పోగొట్టి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్థాయి.
ఇందులోని విటమిన్-సి కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చిగుళ్లను దృఢంగా చేస్తుంది. చిగుళ్ల వాపు, రక్తం కారడంలాంటి వాటిని నివారిస్తుంది. నోరు, చర్మం, ఎముకలకు సంబంధించిన స్కర్వీ అనే వ్యాధిని కూడా రాకుండా కట్టడిచేస్తుంది, అలాగే తగ్గిస్తుంది.