స్మార్ట్‌ఫోన్‌లో జెమిని యాప్ వాడుతున్నారా? లేటెస్ట్ అప్డేట్లో గూగుల్ ఈ యాప్‌ను పూర్తిగా మార్చేసింది. కంటికి సౌకర్యంగా ఉండే డార్క్ మోడ్ తయారుచేసిన ఫైల్స్ అన్నీ ఒకేచోట ఉండేలా ‘My Stuff’ ఫీచర్లను తీసుకొచ్చింది. కొత్త Gemini యాప్ హోమ్‌పేజీలో ఇప్పుడు ‘Where should we start?’ అనే వాక్యం కనిపిస్తుంది. అలాగే, ఇమేజ్, రైటింగ్, రీసెర్చ్, వీడియో క్రియేషన్ లాంటి ‘కెపాసిటీ టూల్స్’ను ఇప్పుడు జాబితా రూపంలో సర్దింది. డార్క్ థీమ్‌ను కూడా అప్డేట్ చేసింది. ఇదివరకు ఉన్న గ్రే రంగు నుంచి దాన్ని బ్లాక్ రంగుకు మార్చారు.
దీంతో రాత్రిపూట యాప్‌ను వాడేటప్పుడు కళ్లకు ఎక్కువ శ్రమ ఉండదు. అయితే, మీరు మెసేజ్ టైప్ చేసే ప్రాంప్ట్ బాక్స్, పూర్తి పేజీ సంభాషణలు మాత్రం పాత రంగులోనే ఉండడం వల్ల యాప్ కొంత డ్యూయల్-టోన్ లుక్‌లో కనిపిస్తుంది. ఈ అప్డేట్లో వచ్చిన ముఖ్యమైన ఫీచర్ ‘My Stuff’ సెక్షన్. మీరు Gemini ద్వారా తయారుచేసిన ఫొటోలు, వీడియోలు, అలాగే Canvasలో చేసిన పనిని మొత్తం ఈ సెక్షన్లో చూడవచ్చు. అంతేకాదు.. ఇకపై చాట్ నిర్వహణ మరింత ఈజీ. మొబైల్ డివైజ్‌లలో, కుడివైపు పై భాగంలో ఉన్న అకౌంట్ స్విచ్చర్ స్థానంలో కొత్త చాట్ బటన్‌ను పెట్టారు. సంభాషణ పేరు ఇప్పుడు డ్రాప్‌డౌన్ మెనూలాగా పనిచేస్తుంది. దీని ద్వారా మీరు షేర్ చేయడం, పిన్ చేయడం, పేరు మార్చడం, లేదా సంభాషణను తొలగించడం లాంటి ఆప్షన్లను వెంటనే వాడుకోవచ్చు. ఈ నయా ఫీచర్స్పై ఓ లుక్కేయండి.