మల్టీటాస్కింగ్ చేయడం ఈ జనరేషన్‌కు అలవాటే! అయితే, నెట్ బ్రౌజింగ్‌లోనూ ఇలా మల్టీటాస్కింగ్ చేసేయొచ్చు. అదెలాగంటే.. గూగుల్ క్రోమ్ ‘Listen to this page’ ఫీచర్‌ని అందిస్తున్నది. దాన్ని వాడుకుని చక్కగా వెబ్ పేజీలను వినొచ్చు. మీరు వింటూనే మరో ట్యాబ్‌లో ఇంకో పని చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకే వాయిస్‌లో ఏం వింటాం? అనుకుంటే.. అందుబాటులో ఉన్న పది వాయిస్‌లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. వేరే యాప్‌లోకి వెళ్లి మల్టీటాస్కింగ్ చేస్తున్నా.. ‘క్విక్ సెట్టింగ్స్’ రూపంలో మీడియా కంట్రోల్స్ తెరపై కనిపిస్తాయి. వాటితో ఆడియోని ‘పాజ్, ప్లే, వాల్యూమ్ కంట్రోల్’ చేయొచ్చు. ప్లేబ్లాక్ స్పీడ్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు. 0.5x నుంచి 4x వరకు మార్చుకోవచ్చు. ఈ తాజా అప్డేట్తో క్రోమ్, సఫారీ బ్రౌజర్‌కి సమంగా నిలిచింది. ఈ నయా ఫీచర్ మొబైల్ బ్రౌజర్లలో గూగుల్ క్రోమ్‌ను బలమైన పోటీదారుగా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. ‘Listen to this page’ వాడదాం అనుకుంటే ముందు క్రోమ్ యాప్‌ని లేటెస్ట్ వెర్షన్‌కి అప్డేట్ చేసుకోవాలి. తర్వాత యాప్ ఓపెన్ చేసి మీరు వినాలనుకునే వెబ్‌పేజీ ఓపెన్ చేయాలి. తర్వాత డాష్‌బోర్డ్ పైభాగంలో మూడు చుక్కల ‘హోం మెనూ’ని సెలెక్ట్ చేయాలి. వచ్చిన డ్రాప్ డౌన్ మెనూలోని ‘Listen to this page’ ఆప్షన్ని ఎంచుకోవాలి. ప్లేయర్ బటన్స్‌తో ఆర్టికల్ రీడింగ్ మొదలవుతుంది. తర్వాత సెట్టింగ్స్‌ని మీకు అనువుగా మార్చుకోవచ్చు.