యాస్మిన్ కరాచీవాలా.. సెలెబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్. కత్రినా కైఫ్, దీపికా పదుకొన్, కరీనా కపూర్, ప్రీతి జింటా, మలైకా అరోరా, బిపాషా, ఆలియా భట్, ఇలియానా.. ఇలా ఆమె శిష్యగణం పెద్దదే. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారామె. ‘రెవల్యూషనైజ్ యువర్ వర్క్ అవుట్’ అనే ఇంటరాక్టివ్ సెషన్లో ప్రసంగిస్తూ అనేక అంశాలు ప్రస్తావించారు..