Gold | బంగారం కొనాలా?ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా?

Gold or Fixed Deposit | మాకు ఒక అమ్మాయి, అబ్బాయి. ఇద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. రెండు నెలల క్రితం మా అత్తగారి వారసత్వ ఆస్తి నుంచి మా వాటాగా పది లక్షలు వచ్చాయి. కొంతమంది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని సలహా ఇస్తున్నారు. మరికొంత మంది అమ్మాయి పెండ్లికి బంగారం కొనిపెట్టుకోమని చెబుతున్నారు. ఎవరి మాట వినాలో అర్థం కావడం లేదు. త్వరగా ఏదో ఒకటి చేయకపోతే ఆ డబ్బు ఖర్చు అయిపోయేలా ఉంది. ఎందుకంటే, మాకు ప్రస్తుతం ఐదు లక్షల దాకా అప్పు ఉంది. కారు లోన్ కూడా ఉంది. మా ఆయనేమో ఉన్న డబ్బుతో అప్పు తీర్చేద్దామని అంటున్నారు. అలా చేయడం నాకు ఇష్టం లేదు. మీ సలహా చెప్పండి.
– ఓ సోదరి
జ: ముందు మీ అప్పుల వివరాలు ఒక కాగితం మీద రాసుకోండి. ఆ జాబితాలో ఎక్కువ వడ్డీ కడుతున్న వాటిని పైన రాయండి. ఎప్పటిలోగా చెల్లించాలో పక్కనే నమోదు చేయండి. ఎక్కువ వడ్డీ, తక్కువ కాల పరిమితి ఉన్న రుణాలను ముందు తీర్చేయండి. దీంతో నెలసరి వాయిదాల బాధ తప్పుతుంది. అదే మొత్తంతో నెలనెలా పొదుపు చేసుకోవచ్చు. ఆ సొమ్ము భవిష్యత్తులో మీ కూతురి పెండ్లికి ఉపయోగపడుతుంది. మీరు చెప్పినదాని ప్రకారం.. ప్రస్తుతం పర్సనల్ లోన్, కారు లోన్ కడుతున్నారు. అంటే ఎక్కువ కాల వ్యవధి ఉండే హోమ్‌లోన్‌తో పోలిస్తే వీటికి వడ్డీ ఎక్కువే. మీ అమ్మాయి ఇంకా చదువుకుంటున్నది కాబట్టి, అప్పుడే పెండ్లి కోసం బంగారం కొనిపెట్టాల్సిన అవసరం లేదు. పైగా అప్పటికి ప్రస్తుత డిజైన్లు పాతబడిపోతాయి. బంగారం ధర తగ్గొచ్చు కూడా. అంతేకాదు ఇంజినీరింగ్ చేశాక మీ అమ్మాయి కనీసం నాలుగేండ్లయినా ఉద్యోగం చేసేందుకు ఇష్టపడుతుంది. కాబట్టి పెండ్లికి చాలా సమయమే ఉన్నట్టు. ఈలోపు మీ దగ్గర ఉన్న డబ్బులో కొంతభాగాన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చు. దయచేసి, అమ్మాయి ఆర్థికంగా స్థిరపడే వరకూ పెండ్లి ఆలోచన చేయకండి.
– దీప నిట్టల, చార్టర్డ్ వెల్త్ మేనేజర్ డైరెక్టర్, శ్రీమంత్రణ ఫైనాన్షియల్ సర్వీసెస్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నా పేరు మీద ఉన్న ఆస్తిపై నా భర్తకు హక్కుఉంటుందా?
Gold Purity | బంగారం కొంటున్నారా.. 22 క్యారట్లు.. 24 క్యారట్లకు తేడా తెలుసా..? ఇదిగో డీటెయిల్స్
బంగారు ఆభరణాలేనా? ఈ బొగ్గు నగల వైపు కూడా ఒక లుక్కేయండి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Advice
- fixed deposits
- gold
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

