నా పేరు మీద ఉన్న ఆస్తిపై నా భర్తకు హక్కుఉంటుందా?
Legal Advice | మా పెండ్లి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందికి వస్తుంది. ఇటీవల మా నాన్న కొనుగోలు చేసిన ఆస్తిని, నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిద్దామని అనుకున్నారు. అలా జరిగితే నా పేరు మీదున్న ఆస్తిపై నా భర్తకు కూడా హక్కు వస్తుందా? రిజిస్ట్రేషన్ సమయంలో ఆయన పేరును కచ్చితంగా పేర్కొనాల్సి ఉంటుందా? సాధారణంగా విడాకులు అయినా, కాకపోయినా భార్య ఆస్తిపై భర్తకు హక్కులు ఉంటాయా? l ఓ వివాహిత

జ: వారసత్వంగా వచ్చే ఆస్తి విషయంలో హక్కులన్నీ ఆయా మతాలతో ముడిపడిన చట్టాలపై ఆధారపడి ఉంటాయి. అయితే మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (ఇద్దరూ మతాంతర వివాహం చేసుకున్నా, ఏ ఒక్కరూ కూడా తమ మతాన్ని మార్చుకోకపోవడం) కింద పెండ్లి చేసుకున్నామని చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో.. విడాకులకు వెళ్లినప్పుడు, కోర్టు మిమ్మల్ని తనకు భరణంగా ఆస్తిలో భాగం ఇవ్వమని చెబితే తప్ప, మీ నాన్న మీ పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తున్న ఆస్తిపై మీ భర్తకు హక్కు ఉండదు. రిజిస్ట్రేషన్ సమయంలో మీ భర్త పేరును ఎక్కడా ప్రస్తావించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు ఎక్కడైనా ప్రస్తావించినా, కేవలం దాని వల్లనే ఆస్తిపై తనకు హక్కు రాదు.
– మానసి చౌదరి, అడ్వకేట్, www.pinklegal.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ విషయంపై నాకు, మావారికీ అవగాహన లేదు.. ఐదేండ్లు అయినా పిల్లలు పుట్టలేదు
అమ్మను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.. నరకం చూపిస్తున్నాడు.. ఏం చేయాలో చెప్పండి
ఆ విషయం ఇంట్లో తెలియకూడదు.. నా వల్ల అమ్మనాన్న తలదించుకోవద్దు
మా అబ్బాయి వింతగా ప్రవర్తిస్తున్నాడు.. ఏం చేయాలో అర్థం కావట్లేదు
ఆ అబ్బాయితో నా చెల్లి పెండ్లి జరిగితే కాపురం సాఫీగా సాగుతుందా?
ఏడు నెలల క్రితం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా.. నా భర్త ఈ మధ్యే చనిపోయాడు.. నేనేం చేయాలి?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

