Advice | నా కొడుకు వయసు తొమ్మిదేండ్లు. కొన్ని నెలలుగా ప్రతి విషయంలోనూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లోని వస్తువులను పగలగొడుతున్నాడు. అమ్మమ్మ, తాతయ్యతో తప్ప ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. తోటి పిల్లల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. చిన్నవాటికే చిరాకు, కోపం ప్రదర్శిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. తనను కౌన్సెలింగ్‌కు తీసుకెళ్తే ఫలితం ఉంటుందా? – ఓ తల్లి
జ: ఇంట్లో అమ్మానాన్నలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి తన పట్ల ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ దూరమైనట్లు మీ అబ్బాయి భావిస్తున్నట్టు అనిపిస్తున్నది. తల్లిదండ్రులు సొంత పనుల్లో బిజీ అయిపోయి, పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోతే.. ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తుంది. తోబుట్టువులతో సమానంగా చూడకపోయినా పిల్లల్లో మార్పు వస్తుంది. కన్నవారి విడాకులు, ఇద్దర్లో ఏ ఒక్కరి దగ్గరో పెరగడం.. తదితర కారణాలూ బాల్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంట్లో ప్రేమ, ఆప్యాయత దక్కని పిల్లలు ఇతరులపై అజమాయిషీ చేయాలనుకోవడం చాలా కేసుల్లో చూస్తుంటాం. అవతలివాళ్లపై నిందలు వేయడం, పక్కవాడు ఏడుస్తున్నా చలించకపోవడం, ఇతరులకు హాని కలుగుతుందని తెలిసి కూడా క్రూరంగా ప్రవర్తించడం.. అలవాటుగా మారుతుంది. ఇలాంటి పిల్లలను కొట్టి, తిట్టి మార్చలేరు. ప్రేమతోనే ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. వాళ్లతో ఎక్కువ సమయం గడపాలి. ఏ ఏ విషయాల్లో బాధ కలుగుతున్నది, ఎలాంటప్పుడు కోపం వస్తున్నదో క్షుణ్నంగా గమనించాలి. కొంచెం ప్రేమగా అడిగితే చాలు, తమ సమస్యలను వెంటనే చెప్పేస్తారు. ఎంత ప్రేమగా ఉన్నా, మార్పు రాలేదంటే కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లడం మంచిది.
సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV
హైదరాబాద్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Asthma in children | ఆస్తమా ఉన్న పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమే
ఆ అబ్బాయితో నా చెల్లి పెండ్లి జరిగితే కాపురం సాఫీగా సాగుతుందా?
ఏడు నెలల క్రితం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా.. నా భర్త ఈ మధ్యే చనిపోయాడు.. నేనేం చేయాలి?
బైపాస్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?