వైవిధ్యం ఉండాల్సిందే!
పేగుల్లో కొన్ని వందల రకాల మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. మనం తినే రకరకాల ఆహార పదార్థాలతోనే అవి శక్తిని పొందుతాయి. అయితే, ఒకే రకమైన ఆహారం తిన్నప్పుడు.. కేవలం కొన్ని రకాల బ్యాక్టీరియాకు మాత్రమే పోషణ అందుతుంది. మిగిలిన మంచి బ్యాక్టీరియాలు క్రమంగా అంతరించిపోతాయి.
బరువు తగ్గాలనో, ఆరోగ్యం కోసమో.. కొందరు స్ట్రిక్ట్ డైట్ పాటిస్తుంటారు. రోజూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటారు. అయితే, ఈ అలవాటు పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో వైవిధ్యం ఉన్నప్పుడే.. గట్ హెల్త్ బాగుంటుందని చెబుతున్నారు.
పేగుల్లో కొన్ని వందల రకాల మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. మనం తినే రకరకాల ఆహార పదార్థాలతోనే అవి శక్తిని పొందుతాయి. అయితే, ఒకే రకమైన ఆహారం తిన్నప్పుడు.. కేవలం కొన్ని రకాల బ్యాక్టీరియాకు మాత్రమే పోషణ అందుతుంది. మిగిలిన మంచి బ్యాక్టీరియాలు క్రమంగా అంతరించిపోతాయి. అలా, పేగుల్లో బ్యాక్టీరియా వైవిధ్యం తగ్గితే.. జీర్ణక్రియ మందగించడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం లాంటి సమస్యలు వస్తాయి. ఇక ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా సరే.. అందులో అన్నిరకాల విటమిన్లు, ఖనిజాలు ఉండవు. దాంతో, పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంతేకాకుండా, శరీరం ఒకే రకమైన ఆహారానికి అలవాటు పడిపోతే.. కొన్నిరోజులకు కొత్తరకం ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
దీనివల్ల ఎప్పుడైనా బయట, ఏదైనా కొత్తగా తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. ‘రెయిన్బో ప్లేట్’ను ఫాలో అవ్వాలి. భోజనంలో వివిధ రంగుల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వారానికి కనీసం 30 రకాల మొక్కల ఆధారిత ఆహార పదార్థాలను తీసుకోవాలట. అప్పుడే గట్ హెల్త్ బాగుంటుందని చెబుతున్నారు. ఇక ఆహారంలో పెరుగు, మజ్జిగ లాంటి ప్రో బయోటిక్ పదార్థాలను చేర్చుకుంటే.. మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. పేగుల ఆరోగ్యానికి భరోసా లభిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

