Health Tips | ఆలూ కుర్మా పూరీలోకి అదిరిపోతుంది. ఆలూ ఫ్రై అన్నిటికీ సరిపోతుంది. పాకశాస్త్రంలో పేరెన్నికగన్న ఈ దుంపకు అందాన్ని పెంపొందించే గుణం ఉంది. ముఖంపై మచ్చలను, మొటిమలను ఆలూ చేత్తో తీసేసినట్టు తొలగించేస్తుంది. అప్పుడు బంగాళా వావ్ వావ్ అని అనకుండా ఉండలేం!
ఆలూలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి దురద, అలర్జీలను దూరం చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, మాంగనీస్, ఫైబర్, విటమిన్ బి, సి చర్మంపై ట్యాన్‌ని తొలగిస్తాయి. ఆలూ రసంలో కాటన్ బాల్స్‌తో అద్దుకొని.. ముఖంపై పది నిమిషాలపాటు మర్దనా చేయాలి. 20 నిమిషాలాగి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల హైపర్ పిగ్మెంటేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలుగడ్డలో ఉండే విటమిన్లు, మినరల్స్, పొటాషియం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
ఆలూ ఫేస్‌ప్యాక్ వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు మాయమవుతాయి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే బంగాళదుంప రసాన్ని ఉపయోగించడానికి ముందు.. ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి రియాక్షన్స్ లేకపోతే.. ముఖానికి అప్లయ్ చేసుకోవాలని చెబుతున్నారు.