Dear Zindagi | ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు.. ఏం చేయాలి?
ఎలా చెప్పాలో తెలియడం లేదు. కాలేజీ రోజుల నుంచీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. క్యాంపస్ ప్లేస్మెంట్లో నాతోపాటు మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. తెలివైనవాడు. బాధ్యత తెలిసిన మనిషి. కానీ, కొంత బోళాగా ఉంటాడు. లౌక్యం తెలియదు. నటన కూడా తెలియదు. కన్నవాళ్లను పరిచయం చేద్దామని మా ఇంటికి ఆహ్వానించాను.
Dear Zindagi | ఎలా చెప్పాలో తెలియడం లేదు. కాలేజీ రోజుల నుంచీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. క్యాంపస్ ప్లేస్మెంట్లో నాతోపాటు మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. తెలివైనవాడు. బాధ్యత తెలిసిన మనిషి. కానీ, కొంత బోళాగా ఉంటాడు. లౌక్యం తెలియదు. నటన కూడా తెలియదు. కన్నవాళ్లను పరిచయం చేద్దామని మా ఇంటికి ఆహ్వానించాను. ఓ గంటసేపు ఉన్నాడు. తనకు మా కుటుంబ సభ్యులు చాలా నచ్చారు. కానీ, మా వాళ్లకే అతను అస్సలు నచ్చలేదు. ‘అతను నీకు తగినవాడు కాదు. నువ్వెక్కడ? అతనెక్కడ?’ అని నిరుత్సాహపరుస్తున్నారు. నాకు తెలియకుండా సంబంధాలు చూస్తున్నారు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఈ సంఘటన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు. నన్నేం చేయమంటారు?
– ఓ సోదరి
ముందుగా ఒక విషయం గుర్తించండి. కన్నవాళ్లు మీ శత్రువులు కాదు, మీ శ్రేయోభిలాషులు. మీ కంటే వయసులో పెద్దవారు. అనుభవ సంపన్నులు. ఎన్నో జీవితాల్ని చూసి ఉంటారు. అనేకమందిని బేరీజు వేసి ఉంటారు. వాళ్ల బేరీజును చులకన చేయకండి. మీ మంచిని కోరే హక్కు, మీ పట్ల బాధ్యత వాళ్లకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది? మీకు అత్యుత్తమమైంది ఇవ్వాలన్నదే అమ్మానాన్నల తపన. అతను ఎందుకు నచ్చలేదో కనుక్కోండి.
ఆ యువకుడి రూపురేఖలు నచ్చలేదా, కుటుంబం నచ్చలేదా, చదువు నచ్చలేదా, ఉద్యోగం నచ్చలేదా, కెరీర్ నచ్చలేదా? కచ్చితంగా చెప్పమని అడగండి. అందులోని నిజానిజాల్ని నిర్ధారించుకోండి. అతని స్నేహితులతో మాట్లాడండి. ఓ స్నేహితురాలిగా మీరు కూడా అతని ఇంటికి వెళ్లండి. ప్రేమలో పడిన తొలిరోజులలో ఎదుటి వ్యక్తి బలహీనతలు కూడా గొప్పగానే అనిపిస్తాయి. భ్రమలు తొలగిపోయాక అవన్నీ లోపాలుగా కనిపిస్తాయి. మీ ప్రేమను పక్కన పెట్టి.. నిజాయతీగా, నిష్పాక్షికంగా బేరీజు వేయండి. మీకు కనిపించిన లోపాల గురించి అతనితో చర్చించండి. మీ కోసం అతను వాటిని జయించగలిగితే తప్పక జీవితంలోకి ఆహ్వానించండి. దాంతోపాటే కన్నవారి మన్ననలూ పొందండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

