ప్రస్తుత కాలంలో సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన కారణంగా సేఫ్టీ ఫీచర్లు కూడా దానికి అనుగుణంగానే రూపొందిస్తున్నాయి టెక్ కంపెనీలు. మహిళలు, పిల్లలు బయటికి వెళ్లినప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందులో యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం అనేది నేటి సమాజంలో భద్రతా సమస్యలకు ఒక పరిష్కార మార్గంగా ఉంది. ‘నమోలా’ యాప్ కూడా అదే కోవకు చెందినది. అత్యవసర సమయంలో సన్నిహితులను, స్నేహితులను లేదా పోలీసులను సంప్రదించడానికి ఈ యాప్ సహాయపడుతుంది.
అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బందిని కూడా ఈ యాప్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ యాప్ నుంచి లొకేషన్ షేర్ చేసే అవకాశం ఉంది. ఈ యాప్ వేసుకున్న వారు లొకేషన్‌కు చేరుకున్నా లేదా ప్రయాణాన్ని ప్రారంభించినా తమవాళ్లకు నోటిఫికేషన్ వెళ్లేలా ఆప్షన్‌ను పొందుపరిచారు. అంతేకాదు, ఎమర్జెన్సీ వైద్య సేవలు పొందే అవకాశాన్ని కూడా నమోలా యాప్ కల్పిస్తుంది. ఆండ్రాయిడ్ ఐఓఎస్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఇప్పటికే లక్ష మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు.