ఆరోగ్యాన్ని కోరుకుంటున్న చాలామంది రాత్రుళ్లు అన్నానికి బదులు రొట్టెలు తింటున్నారు. ఇవి కడుపు నింపడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. అయితే, ఒక్కో రకం రొట్టెలు ఒక్కో లాభాన్ని చేకూరుస్తుంటాయి. ఆ ప్రయోజనాలు మీరూ తెలుసుకోండి.
గోధుమ రొట్టె: చాలామంది చపాతీలు ఇష్టంగా తింటారు. గోధుమల్ని ప్రాసెస్ చేసినప్పుడు అందులో ఫైబర్ తగ్గి, చకెర స్థాయులు పెరుగుతాయి. దీని ైగ్లెసెమిక్ ఇండెక్స్ చిరుధాన్యాల కంటే ఎకువగా ఉంటుంది. అందువల్ల గోధుమ రొట్టెతో కొద్దిగా సోయా, శనగల్ని కలిపి తీసుకోవడం మంచిది.
మిల్లెట్స్ రోటీ: కాలం ఏదైనా మిల్లెట్ రోటీ తినడం చాలామంచిది. వీటి ద్వారా శరీరానికి ఎకువ మొత్తంలో ఫైబర్, ఐరన్ అందుతాయి. మిల్లెట్ రోటీ తింటే మలబద్ధకం, ఉబ్బరం తగ్గుతాయి. అయితే అతిగా కాకుండా వారానికి రెండుసార్లు తింటే సరిపోతుంది.
మక్క రొట్టె: ఇందులో ఫైబర్ పుషలంగా ఉంటుంది. కానీ, కార్బోహైడ్రేట్స్ కూడా ఉండటంతో మక్క రొట్టె తింటే చక్కెర స్థాయులు అమాంతం పెరుగుతాయి. కాయకష్టం చేసేవాళ్లు మక్కరొట్టె దర్జాగా తినొచ్చు. డెస్క్ జాబ్‌లు చేసేవాళ్లు.. రుచి కోసం ఎప్పుడో ఓసారి తినొచ్చు.
జొన్న రొట్టె: సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఇందులో పుషలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అధిక బరువుతో ఉన్నవాళ్లు రెగ్యులర్‌గా జొన్న రొట్టె తింటే మంచి గుణం కనిపిస్తుంది.
రాగి రొట్టె: రాగుల్లో ైగ్లెసెమిక్ ఇండెక్స్ తకువగా ఉండటంతోపాటు ఫైబర్ ఎకువగా ఉంటుంది. బరువు తగ్గడానికి, రక్తంలో చకెర తగ్గేందుకు, బలమైన ఎముకలకి, జీర్ణక్రియకి, దీర్ఘకాలిక శక్తికి, మంచి నిద్రకు రాగి రొట్టె చాలా మంచిది. ఇందులో క్యాల్షియం కూడా పుషలంగా ఉంటుంది. కాబట్టి దీనిని రెగ్యులర్‌గా ప్రయత్నించొచ్చు.