టీ, కాఫీ, మద్యం ఈ మూడింటి గురించి పరిశోధన సాగని రోజు ఉండదేమో. టీలో ఉండే థియామిన్ వల్ల మంచిచెడుల గురించి నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందులోని ఔషధ గుణాలు పూర్తిగా అందాలంటే, టీలో పాలు కలపకూడదనే సూత్రం ప్రచారంలో ఉంది. తాజాగా, బ్లాక్ టీ వల్ల మరో లాభం కూడా ఉందంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు. వీరి నివేదిక ప్రకారం బ్లాక్ టీ, గ్రీన్ టీ లో ‘కెటషిన్స్’ అనే పదార్థాలు ఉంటాయట. ఇవి రక్తనాళాలకి ఉపశమనం కలిగిస్తాయట. దానివల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎప్పటిలాగే ‘మోతాదులో తాగండి’ అనే షరతును మాత్రం పేర్కొంటున్నారు.