అమ్మ కోసం వీర భద్రాసనం

కడుపులో నలుసు పడింది మొదలు, పురుటినొప్పులను తలుచుకొని మహిళలు భయపడుతుంటారు. అమ్మదనాన్ని అందుకోవాలంటే ప్రసూతి గండం గట్టెక్కాల్సిందే. యోగాలో గర్భిణికి ఆరోగ్యాన్ని, బలాన్నిచ్చే ఆసనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి వీర భద్రాసనం. ఈ ఆసనంతో వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు.
సమస్థితి: ముందుగా నిటారుగా నిల్చొని రెండు పాదాలు దగ్గరగా ఉంచి, చేతులు ఫ్రీగా ఉంచాలి.
ఆసన స్థితి: ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ కుడికాలును వెనక్కి కదిలించాలి. రెండు పాదాలమధ్య మూడు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. వెనుక పాదాన్ని 45 డిగ్రీలు ఎడంగా తిప్పాలి.
- శ్వాస నిదానంగా వదులుతూ ఎడమకాలును మోకాలి దగ్గర 90 డిగ్రీలు వంచాలి.
- మళ్లీ శ్వాస తీసుకుంటూ రెండు చేతులను (చిత్రంలో చూపించిన విధంగా) తలమీదుగా పైకెత్తాలి. తర్వాత తలను నిదానంగా పైకెత్తి రెండు చేతులనూ చూడాలి.
- నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఈ ఆసన స్థితిలో 20 సెకన్లు ఉండాలి. తర్వాత మెల్లగా సమస్థితికి వచ్చేయాలి.
- ఎడమకాలిని వెనక్కి కదిలించి ఇదే ప్రకారంగా మళ్లీ ఆసనం వేయాలి.
- వీర భద్రాసనం వల్ల వెన్నెముక దృఢంగా మారుతుంది. మెడ, భుజాలు, కాళ్లు, చేతులకు సత్తువ వస్తుంది. వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. తుంటి సమస్యలు తగ్గుతాయి.
- ముందుగా వైద్యుల అనుమతి తప్పనిసరి. అధిక రక్తపోటు, కాళ్లవాపు ఉన్నవాళ్లు ఈ ఆసనం వేయొద్దు. వ్జైనానుంచి రక్తస్రావం అవుతునప్పుడు దీనిని ప్రయత్నించక పోవడమే మంచిది. గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
హైదరాబాద్, 6309800109
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- health tips
- pregancy
- Yoga
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

