వజ్రా భరణం కళతప్పితే..
డైమండ్ జువెలరీని పాతతరం ఎంతగా ప్రేమించిందో కొత్తతరమూ అంతే ఇష్టపడుతున్నది. కానీ నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా నగ చిన్నబోతుంది. వజ్రం కళ తప్పుతుంది. కాబట్టి, తగిన జాగ్రత్తలు తప్పనిసరి.
డైమండ్ జువెలరీని పాతతరం ఎంతగా ప్రేమించిందో కొత్తతరమూ అంతే ఇష్టపడుతున్నది. కానీ నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా నగ చిన్నబోతుంది. వజ్రం కళ తప్పుతుంది. కాబట్టి, తగిన జాగ్రత్తలు తప్పనిసరి.
మనం వాడే అత్తర్లు, సన్‌స్క్రీన్ లోషన్లలోని రసాయనాల ప్రభావంతో కొన్నిసార్లు వజ్రాలకు పగుళ్లు రావచ్చు. హెయిర్ స్ప్రేల వల్ల కూడా జువెలరీ లోహపు పూత తొలగిపోతుంది. కాబట్టి, అలంకరణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
డైమండ్ రింగ్‌పై పేరుకుపోయిన మలినాల్ని తొలగించేందుకు సహజమైన నూనెలను ఉపయోగించాలి. మృదువైన వెల్వెట్ వస్త్రంతోనూ శుభ్రం చేయవచ్చు. సబ్బునీటిని వేడి చేసి టూత్‌బ్రష్‌తో కూడా కడిగేయవచ్చు. ఆరుపాళ్లు నీరు, ఒక పాలు అమ్మోనియం ద్రావణాన్ని తీసుకొని.. అందులో డైమండ్ జువెలరీని కడిగితే కొత్త మెరుపు వస్తుందంటారు స్వర్ణకారులు.
ఆభరణాల శుభ్రతపై ఎంత శ్రద్ధ పెడతామో వాటిని ధరిస్తున్నప్పుడు, భద్రపరుస్తున్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు డైమండ్ జువెలరీని వాటికోసం కేటాయించిన ప్రత్యేకమైన పెట్టెలోనే పెట్టాలి. అందులో మృదువైన వస్త్రం ఉండేలా చూసుకోవాలి. ఆ బాక్స్ పొడిగా ఉండాలి కూడా.
చల్లటి ప్రదేశంలో భద్రపరిస్తే వజ్రాలు ఎంతకాలమైనా నిగనిగలాడుతూ ఉంటాయి. మీ ఆభరణాలు దెబ్బతిన్న తర్వాతో, దొంగల పాలయ్యాకో చింతించే బదులు.. ముందుగానే వాటికి బీమా చేయించడం ఉత్తమం. ఇందుకోసం మార్కెట్లో ఎన్నో ఆఫర్లు ఉన్నాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

