కొందరంతే. అన్నిరకాల ఆరోగ్య జాగ్రత్తలూ తీసుకుంటారు. మంచి జీవనశైలిని కొనసాగిస్తారు. అయినా డిమెన్షియా (ఆలోచనాశక్తిని కోల్పోవడం) బారిన పడుతుంటారు. దీనికి ముఖ్య కారణం ఆయా వ్యక్తుల తాత ముత్తాతలకు ఈ సమస్య ఉండటం. ఇతరులతో పోలిస్తే, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో డిమెన్షియా వచ్చే ఆస్కారం 75శాతం అధికమని తాజా అధ్యయనం తెల్చింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదికలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అధ్యయనంలో మొత్తం మూడులక్షల మంది పాల్గొన్నారు. వాళ్లంతా 50 నుంచి 73 ఏండ్ల మధ్యవారే. చక్కని ఆహారం తింటూ, సమయానికి నిద్రపోతూ, నిత్యం వ్యాయామం చేస్తూ.. ధూమపానానికి దూరంగా ఉంటున్నా.. కుటుంబ చరిత్ర కారణంగా డిమెన్షియా బారినపడ్డవారే ఎక్కువ.