ఇది డిజిటల్ యుగం. సోషల్‌మీడియా కాలం. నెటిజన్లకు ఏది చెప్పాలన్నా మీమ్స్ రూపంలో లేదా సినిమా డైలాగులతో వారి భాషలో చెప్పాలి. అప్పుడే వాళ్లు ఆ విషయాన్ని ఆనందంగా బుర్రకెక్కించుకుంటారు. ఇదే ట్రిక్‌ను ఫాలో అయ్యారు ఢిల్లీ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు సినిమా డైలాగ్‌లతో కూడిన మీమ్‌తో వినూత్న ప్రచారం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఢిల్లీ పోలీసులు షేర్ చేసిన వీడియోలో ఓ కారు రెడ్‌లైట్‌ను దాటుకుని వేగంగా దూసుకెళ్తుంది. రెడ్‌లైట్‌పై కరీనాకపూర్ ఫొటో ప్రత్యక్షమవుతుంది. ‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రంలోని కరీనాకపూర్ పాత్ర పూ చెప్పే డైలాగ్ వినిపిస్తుంది. ‘అతను ఎవరు.. కనీసం నావైపైనా తిరిగి చూడలేదు’ అనే డైలాగ్ చెప్తుంది. ‘ఆ ట్రాఫిక్ ఉల్లంఘించిన వ్యక్తి ఎవరు? పూ మిమ్మల్ని ఇష్టపడుతున్నది. ఒక్కసారి ఆ రెడ్‌లైట్ వంక చూడండి’ అని ఈ వీడియోకు పోలీసులు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో 24వేలకు పైగా వీక్షణలను సొంతం చేసుకున్నది. నెటిజన్లు కూడా ఈ మీమ్‌ను చాలా ఇష్టపడ్డారు. పోలీసుల సృజనాత్మకతను ప్రశంసించారు.
Who’s that traffic violator?
Poo likes attention, so do the traffic lights !#RoadSafety#SaturdayVibes pic.twitter.com/ZeCJfJigcb
— Delhi Police (@DelhiPolice) July 16, 2022