క్యాన్సర్ రోగుల కోసం జుట్టు దానం ఇస్తున్న దయా సిస్టర్స్
అన్నదానం, విద్యాదానం, నేత్రదానం, రక్తదానం, చివరికి అవయవదానం గురించి కూడా వింటున్నాం. కానీ, కేశదానం పట్ల మాత్రం ప్రజల్లో ఇప్పటికీ పెద్దగా అవగాహన లేదు. రేడియేషన్, కీమోథెరపీ కారణంగా క్యాన్సర్ రోగులు జుట్టును కోల్పోతున్నారు. ఆ వెలితి కొన్నిసార్లు రోగం కంటే ఎక్కువగా కుంగదీస్తుంది. అలాంటి మహిళలను చూసి చలించిపోయారు దయా సిస్టర్స్.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన దయా రమాదేవి, దయా లావణ్య అక్కాచెల్లెళ్ల్లు. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉంటారు. ఇద్దరిలో అక్క రమాదేవి పీజీ చదివింది. చెల్లి లావణ్య ఎంటెక్ పాసైంది. ‘తల దువ్వుకుంటున్నప్పుడు దువ్వెనకు నాలుగైదు వెంట్రుకలు చికి ఊడిపోతేనే విలవిలలాడిపోతాం. అలాంటిది, జుట్టంతా కోల్పోయినవారి బాధ ఇంకెలా ఉంటుందో? అనిపించేది మాకు. మా వంతుగా ఏమీ చేయలేమా? అన్న ప్రశ్న కూడా వెంటాడేది. ఏ విషయాన్ని అయినా ఎదుటి మనిషి కోణంలో ఆలోచించడం నేర్పారు మా నాన్న దయా వెంకటయ్య. ఆయన మాటలే ఆదర్శంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటారు ఇద్దరూ. తాజాగా ఈ అక్కాచెల్లెళ్లు.. చికిత్స సమయంలో జుట్టు కోల్పోయిన క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా విగ్గులు తయారీ చేసిచ్చే ఇండియన్ గర్ల్స్ హెయిర్ డొనేషన్ సంస్థకు తమ కురులను దానంగా ఇచ్చారు. భవిష్యత్తులోనూ ఇలానే దానం చేస్తామని ప్రకటించారు. ‘జడ దానం చేయండి.. క్యాన్సర్ బాధితులకు మనోైస్థెర్యాన్ని ఇవ్వండి’ అంటూ సామాజిక వేదికల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు రమ, లావణ్య. ఇంటి పేరు నిలబెట్టడం అంటే ఇదే!
– బండారు రాజు
Read More :
“IAS Anwesha Reddy | కొత్త తెలంగాణచూస్తున్నా.. కలహండి కలెక్టరమ్మ”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Cancer
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

