Bike Taxi | అమ్మాయిల కోసమే బైక్ ట్యాక్సీ.. హైదరాబాదీ అక్కాచెల్లెళ్ల ఆలోచన అదుర్స్
Bike Taxi | రిక్షాల యుగం. ఆలస్యమైనా భద్రంగానే వెళ్లే వాళ్లం. ఆటోల కాలం. వేగం పెరిగినా ఎంతోకొంత భయమే. క్యాబ్.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బైక్ ట్యాక్సీ అయితే కొంత నయం. కానీ, ఎంతవరకు సురక్షితం? మహిళలు ధైర్యంగా బుక్ చేసుకొని వెళ్లగలరా?.. ఇలా ఎన్నో సందేహాలు. వాటికి పరిష్కారం చూపుతున్నారు హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు!
సమస్య-1
ప్రత్యూష ఎల్బీనగర్లో ఉంటుంది. ఉద్యోగం బంజారాహిల్స్‌లో. ఆఫీస్ నుంచి బయటికి వచ్చేసరికి సాయంత్రం ఏడు దాటుతుంది. అదేమో బస్ రూట్ కాదు. ఆ దారిలో వెళ్లే కొలీగ్స్‌తో కలిసి వెళ్దామని అనుకుంటుంది. కానీ, ఆ సమయానికి వాళ్ల పని పూర్తికాదు. దీంతో, ఓసారి క్యాబ్ కోసం సెర్చ్ చేసింది. అంత మొత్తం చెల్లించలేక వెంటనే క్యాన్సిల్ చేసింది. ఆటో బుక్ చేద్దామనుకుంది. ఖైరతాబాద్ మెట్రో వరకే రూ.150 చూపించింది. మళ్లీ బడ్జెట్ ప్రాబ్లమ్. చివరిగా బైక్ ట్యాక్సీని ఎంచుకుంది. ధర తక్కువే కానీ, మగ చోదకుడు. ఇబ్బందిగానే గమ్యానికి చేరుకుంది.
సమస్య-2
దివ్య యూసుఫ్‌గూడలోని హాస్టల్లో ఉంటుంది. బేగంపేటలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తుంది. మరీ దూరం కాదు కాబట్టి బస్సులో వెళ్లొచ్చు. అవసరాన్ని బట్టి బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునేది. ఓసారి, కెప్టెన్ దురుసుగా ప్రవర్తించాడు. అప్పటినుంచీ ఆ జోలికే వెళ్లలేదామె. నిత్యం బస్సులోనే ప్రయాణి స్తున్నది.
ఒకే పరిష్కారం
ప్రత్యూష, దివ్య.. ఇద్దరి వృత్తులూ వేరు. కానీ అవసరం ఒకటే. తక్షణం సురక్షితమైన, విశ్వసనీయమైన రవాణా సౌకర్యం కావాలి. వీరిద్దరే కాదు. హైదరాబాద్‌లో ఇలాంటివాళ్లు చాలామంది ఉన్నారు. టోలీచౌకీకి చెందిన ఇద్దరు యువతులు తమ స్నేహితులతో కలిసి వీరి కోసం ఓ పరిష్కారాన్ని కనిపెట్టారు. కేవలం మహిళా రైడర్ల కోసమే బైక్‌ట్యాక్సీ సేవలను ప్రవేశపెట్టారు. డవ్‌లీ..
మహిళల కోసం మహిళలే స్థాపించిన స్టార్టప్. బైక్‌లను నడిపేది కూడా మహిళా కెప్టెన్లే. డవ్‌లీ వ్యవస్థాపకులు.. జైనబ్ ఖాటూన్, ఉజ్మా ఖాటూన్ అనే అక్కాచెల్లెండ్లు. వీరికి ఫాతిమా, ఉబేదుల్లా అనే మిత్రులు తోడయ్యారు. జైనబ్ ఫార్మసీ విద్యార్థి. ఉజ్మా బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నది. ‘యాప్స్ వచ్చాక ప్రయాణం సులభతరమైనా, మహిళలకు రక్షణ ఉండటం లేదు. గతంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కాదు’ అంటూ ఓ సందర్భంలో తల్లి బాధపడిపోయిన సంఘటన ఆ ఇద్దరిలో కొత్త ఆలోచన రేకెత్తించింది. నిజానికి, జైనబ్ మిత్ర బృందానికి కూడా అలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి. ‘ఓసారి ఫ్రెండ్స్‌తో కలిసి నేను ఆటోలో వెళ్తున్నా. మేమేదో ముచ్చట్లలో ఉన్నాం. డ్రైవర్ రియర్ వ్యూ మిర్రర్లోంచి మమ్మల్ని చూస్తున్నాడని అర్థమైంది. చాలా అసౌకర్యానికి గురయ్యాం’ అంటూ ఓ సంఘటనను గుర్తుచేసుకుంది జైనబ్. అదే డవ్‌లీ స్థాపనకు కారణమైంది. వెంచర్ క్యాపిటలిస్టుల సహకారంతో ఈ వ్యాపారాన్ని విస్తరించాలన్నది ఆ తోబుట్టువుల ఆలోచన. క్రమంగా త్రీ వీలర్, ఫోర్ వీలర్ సేవలనూ అందించాలని అనుకుంటున్నారు. ‘ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య 7893128773 నంబర్‌కు వాట్సాప్ ద్వారా లేదా www.dovely.org ద్వారా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన.. ఈ రెండూ మా లక్ష్యాలు’ అని చెబుతారు డవ్‌లీ బృందంలోని నలుగురూ.
పేరు వెనుక కథ
కంపెనీ పేరు నిర్ణయించే ముందు చాలా పరిశోధనే చేశారు. కొత్తకొత్త పేర్లు ఆలోచించారు. చివరికి ‘డవ్‌లీ’గా ఖరారు చేశారు. డవ్.. అంటే పావురం. ప్రస్తుతం ఇరవైమంది దాకా మహిళా కెప్టెన్లు పేరు నమోదు చేసుకున్నారు. నాలుగు వందల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. నిపుణుల సహ కారంతో పూర్తిస్థాయి యాప్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
… దాయి శ్రీశైలం
Read More :
“Josh Talks | ప్రతి సక్సెస్ స్టోరీ సెలెబ్రిటీలదే ఎందుకు కావాలి?”
“బెంగాల్ టైగర్, ఖడ్గమృగాలను చూస్తేనే పారిపోతాం.. ఈ సివంగులైతే వాటికే సెక్యూరిటీ”
“CR Lejumol | 47 ఏనుగులకు ఈమె సంరక్షకురాలు.. ఎలా సాధ్యమైందంటే..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- taxi
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

