వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో అదిరిపోయే రగ్గులు, బెడ్ షీట్స్.. ఇంకా ఎన్నెన్నో !!
The Rug Republic | ఇక ప్లాస్టిక్ ఏమాత్రం ప్రాణాంతకం కాదు. వందల ఏండ్లు గడిచినా కరిగిపోని ప్లాస్టిక్ ఇకనుంచి.. నేలతల్లి ఒడిలో నూలుపోగులా మారిపోనుంది. ఇన్నాళ్లూ పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్.. కొత్త రూపాన్ని సంతరించుకొని డోర్‌మ్యాట్స్, కుషన్స్, బెడ్‌షీట్స్, రగ్గులు, దుప్పట్లుగా పరిచయం అవుతున్నది. మనం వాడి పడేసే పాస్టిక్ బాటిళ్లను ఢిల్లీకి చెందిన ‘ద రగ్ రిపబ్లిక్’ అనే సంస్థ నూలుగా మారుస్తూ మంచి ఆవిష్కరణకు తెరలేపింది.

ప్లాస్టిక్ వస్తువులను వాడిన ప్రతిసారీ పర్యావరణానికి హాని చేస్తున్నామనే అపరాధభావం స్థిమితంగా ఉండనీయదు. ఇప్పుడా బెంగ అవసరం లేదు. ఎందుకంటే, ప్లాస్టిక్ చేనేత మగ్గంపై నూలుపోగుగా మారిపోతున్నది. నూటికి నూరుపాళ్లు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ రకాల, రంగురంగుల వస్ర్తాలను తయారుచేస్తున్నది.. ‘ద రగ్ రిపబ్లిక్’. ప్లాస్టిక్‌ను ఎంతగా రీసైకిల్ చేసినా.. తిరిగి ఏదో విధంగా పర్యావరణానికి హాని కలిగిస్తుండటంతో ఏకంగా నూలుపోగులా మార్చే సాంకేతికతను తీసుకొచ్చింది రగ్ రిపబ్లిక్. ప్లాస్టిక్ ఉత్పత్తుల రీసైకిల్లో అగ్రగామిగా, ‘గ్లోబల్ రీసైక్లింగ్ స్టాండర్డ్స్’ (జీఆర్ఎస్) సర్టిఫికేషన్ కలిగిన ఏకైక భారతీయ సంస్థ ఇది.

నూలు నుంచి సిల్కు వరకూ..
వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ప్లాస్టిక్‌ను రసాయన, యాంత్రిక ప్రక్రియల ద్వారా మొదట నూలుగా మార్చేస్తారు. దానికి పత్తి, ఉన్ని, ఇతర కాటన్ పదార్థాలను జోడిస్తారు. వీటితోపాటుగా రీసైక్లింగ్ కోసం సేకరించిన కాటన్ చీరలు, డెనిమ్ వస్ర్తాలు, సిల్క్ వంటి ఇతర ఫ్యాబ్రిక్స్ కలిపి రంగురంగుల దారాలు తయారుచేస్తారు. తర్వాత వాటిని శానిటైజ్ చేసి, హానికారక క్రిములను నిర్మూలిస్తారు. అనంతరం ఆ దారాలతో రగ్గులు, డోర్‌మ్యాట్స్, కుషన్స్, బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్లు, దుప్పట్లు అల్లుతున్నారు. వాడిపడేసిన ప్లాస్టిక్‌కు నూలు రూపం ఇవ్వడం, దానినుంచి పర్యావరణహితమైన వస్ర్తాలను తయారు చేయడం ఓ గొప్ప ప్రయత్నం.

ప్రముఖ డిజైనర్లతో..
‘ద రగ్ రిపబ్లిక్’లో ప్రత్యేకించి ఓ డిజైనర్ల బృందమే ఉంది. తయారీ ప్రక్రియ ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని తయారీ కేంద్రంలో జరుగుతుంది. మొదట్లో రగ్గుల తయారీకే మొగ్గుచూపినా.. నూలు సున్నితంగా ఉండటంతో కుషన్ కవర్లు, పౌఫ్లు కూడా తయారు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతులు ఉపయోగించి మగ్గంపై మన్నికగా ప్రాణంపోస్తున్నారు. ఒక రగ్గు తయారీకి దాదాపు మూడు వందలకు పైగా రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తామని చెబుతారు ‘ద రగ్ రిపబ్లిక్’ ఈ-కామర్స్ డైరెక్టర్ రాఘవ్ గుప్తా. ప్లాస్టిక్ రగ్గులు, కుషన్ కవర్స్, పిల్లో కవర్స్, డోర్‌మ్యాట్స్ కావాలనుకుంటే trrhome.com వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.

Read More :
“CR Lejumol | 47 ఏనుగులకు ఈమె సంరక్షకురాలు.. ఎలా సాధ్యమైందంటే..”
IAS Keerthy Jally | అవకాశం ఇస్తే తెలంగాణకు వస్తా.. కచార్ జిల్లా కలెక్టర్ కీర్తి జల్లి”
“Neeta Patel | ఈమె గుజరాత్‌లోని 300 గ్రామాల దాహం తీర్చింది”
అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఆపదలో ఉన్నవారికి చేయూత అందిస్తున్న తెలంగాణ బిడ్డ”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

