చీజ్ ముక్కలు: నాలుగు, ఆరిగానో: పావు టీస్పూన్, చిల్లీ ఫ్లేక్స్: అర టీస్పూన్, చాట్ మసాలా: చిటికెడు.
చీజ్ స్లెసులను త్రిభుజాకారంలో నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి దానిపై ఒకదానికొకటి అంటకుండా చీజ్ ముక్కల్ని పరచాలి. పైనుంచి ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, చాట్ మసాలా చల్లాలి. వీటిని ఓవెన్లో 180 డిగ్రీల వద్ద పది నిమిషాలు బేక్ చెయ్యాలి. బయటికి తీశాక కాస్త చల్లారనిస్తే కరకరలాడే చీజ్ చిప్స్ సిద్ధం.