మన శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే పోషకాలల్లో బొబ్బర్లది ప్రత్యేకస్థానం. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యం వంటి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శాఖాహారం తీసుకునే వారికి ఇవి పుష్కలంగా ప్రొటీన్లు అందిస్తాయి. బొబ్బర్లలో తకువ కొవ్వులు, క్యాలరీలు ఉండటంతో పాటు శరీరానికి మేలు చేసే కీలక పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, శక్తికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక కప్పు ఉడికించిన బొబ్బర్లలో సుమారు 13 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. కరిగే, కరగని పీచు పదార్థం అధికంగా ఉండి జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది. ఒక కప్పు ఉడికించిన బొబ్బర్లలో దాదాపు 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇక విటమిన్ల విషయానికొస్తే విటమిన్ ఎ, సి, కె, బి కాంప్లెక్స్ పుష్కలంగా దొరుకుతాయి. వాటితో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
బొబ్బర్లను తరచూ తీసుకోవడం వల్ల చాలారకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో క్యాలరీలు, కొవ్వులు చాలా తకువగా ఉండి అధికంగా ఉండే ఫైబర్, ప్రొటీన్ వల్ల ఎకువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గి, బరువు తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇందులోఉండే పీచు పదార్థం రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో సాయపడుతుంది. వీటిలోని పొటాషియం, మెగ్నీషియం, ఫైటోస్టెరాల్స్ రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. బొబ్బర్ల గె్లైసెమిక్ ఇండెక్స్ చాలా తకువగా ఉంటుంది. వీటిని తిన్న తర్వాత రక్తంలో చకెర స్థాయులు నెమ్మదిగా పెరుగుతాయి.
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే ఐరన్, ఫోలేట్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. గర్భిణులకు ఫోలెట్ చాలా ముఖ్యం. ఇది శిశువులలో పుట్టుక లోపాలను నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి యాంటి ఆక్సిడెంట్లుగా మారి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. విటమిన్ ఎ.. కార్నియాను మెరుగుపరిచి మన కండ్లను రక్షిస్తుంది. బొబ్బర్లను ఉడకబెట్టి తివొచ్చు. సలాడ్లలో భాగంగా తివొచ్చు. ఇతర కూరల్లోనూ వీటిని వేసుకోవచ్చు. గారెలుగా చేసుకుంటే వాటి రుచే వేరు.