ఆఫీస్ పని, పిల్లల ఆన్లైన్ క్లాసులు, పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కోసం ల్యాప్‌టాప్ అనేది ఒక కంపల్సరీ గ్యాడ్జెట్ అయింది. కానీ, మంచి ల్యాపీ కొనాలంటే లక్షల్లో పెట్టాల్సి వస్తుంది. అందుకే, తక్కువ బడ్జెట్లో, పవర్ఫుల్ పర్ఫామెన్స్ ఇచ్చే ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే Chuwi CoreBook X ల్యాప్‌టాప్. ఇది స్టూడెంట్స్‌కి, ఆఫీస్ వర్క్‌కి పర్ఫెక్ట్ చాయిస్. 14 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 1920×1200. దీంతో సినిమాలు చూసినా, ఆఫీస్ పని చేసినా.. విజువల్స్ చాలా షార్ప్‌గా, వైబ్రెంట్‌గా కనిపిస్తాయి. ఇంటెల్ కోర్ ఐ3-10100వై ప్రాసెసర్‌ని వాడారు. దీంతో రోజువారీ పనులైనా, చదువుకు సంబంధించిన టాస్క్‌లైనా స్మూత్‌గా చేసుకోవచ్చు. ర్యామ్ కెపాసిటీ 8 జీబీ. ఒకేసారి ఎన్ని యాప్స్, బ్రౌజర్ ట్యాబ్స్‌ను ఓపెన్ చేసినా.. సమర్థంగా పని చేస్తుంది. ఇందులో 256 జీబీ ఎస్ఎస్డీ ఉంది. వేగంగా పనిచేయడంలో సాయపడుతుంది. డేటాకు భద్రత ఇస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ల్యాపీ వస్తుంది. కాంపాక్ట్ డిజైన్ వల్ల దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు.
ధర: 21,990
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

చాలామంది యూట్యూబ్ చానెల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఆఫీస్ మీటింగ్స్‌లో, ఆన్లైన్ క్లాసుల్లో రోజూ పాల్గొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీడియో క్వాలిటీ ఎంత బాగున్నా… వాయిస్ క్వాలిటీ సరిగా లేకపోతే ‘వైబ్’ పోతుంది. అందుకే మీ వాయిస్‌ను క్లియర్‌గా, ప్రొఫెషనల్‌గా వినిపించేలా చేయాలంటే మంచి మైక్రోఫోన్ అవసరం. అదే DIGIMORE Lavalier Micro phone. ఇది తక్కువ బడ్జెట్లో దొరికే చిన్న ఓమ్ని డైరెక్షనల్ మైక్. అంటే.. అన్ని వైపుల నుంచి సౌండ్‌ను పట్టుకోగలదు. ఇంటర్వ్యూలు, జూమ్ కాల్స్, వీడియో రికార్డింగ్‌కి పర్ఫెక్ట్. ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్ చిప్సెట్ ఉంది. దీంతో చుట్టూ ఉండే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఫిల్టర్ చేస్తుంది. మీ వాయిస్ మాత్రమే క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది. 3.5 ఎంఎం జాక్, టైప్-సి కనెక్టర్.. రెండిటినీ సపోర్ట్ చేస్తుంది. దీంతో పాత మొబైల్స్ అయినా, కొత్త ల్యాప్టాప్స్ అయినా.. దేనికైనా కనెక్ట్ చేయొచ్చు. క్లాసులు చెప్పే టీచర్స్‌కి, మీటింగ్స్‌లో మాట్లాడే ప్రొఫెషనల్స్‌కి ఇది సూపర్ యూజ్‌ఫుల్.
ధర: రూ. 349
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ ఈ-కార్ట్స్‌లో అందుబాటులో ఉంది.

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం మాట్లాడటానికి మాత్రమే కాదు. ఇదో పర్సనల్ కంప్యూటర్, డీఎస్ఎల్ఆర్ కెమెరా, ఎంటర్టైన్మెంట్ అడ్డాగా మారిపోయింది. ఈ క్రమంలో అన్ని ఫీచర్లు ఒకేచోట దొరకడం కష్టమేమీ కాదు. MOTOROLA Edge 60 Fusion 5Gతో పక్కా సాధ్యం. 6.7 అంగుళాల 1.5కే డిస్ప్లే ఉంది. దీంతో మీరు సినిమా చూసినా, గేమ్ ఆడినా.. విజువల్స్ చాలా షార్ప్‌గా కనిపిస్తాయి. కెమెరా సెటప్ జెన్-జీని పక్కా ఆకట్టుకుంటుంది. ఇందులో 50ఎంపీ సోనీ లైటియా 700సి సెన్సర్ ఉంది. దీంతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో పర్ఫెక్ట్ ఫొటోలు తీసుకోవచ్చు. ‘మోటో ఏఐ’ దీంట్లోని మరో ప్రత్యేకత. అంటే.. ఫోన్ ఫీచర్లన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తాయి. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ కారణంగా నీటిలో తడిసినా ఏమీ కాదు. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 68వాట్స్ టర్బో పవర్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో కేవలం 9 నిమిషాల్లోనే రోజుకు సరిపడా చార్జింగ్ ఎక్కేస్తుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ వల్ల పర్ఫామెన్స్ కూడా వేరే లెవల్లో ఉంటుంది.
ధర: రూ. 19,999
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

ఫ్లయిట్లో, బస్సులో ప్రయాణిస్తున్నా.. ఆఫీస్‌లో పని చేస్తున్నా… చుట్టూ ఉన్న శబ్దాలతో కాస్త ఇబ్బందే. ఈ సమస్యకు సోనీ కంపెనీ అందిస్తున్న సొల్యూషన్.. SONY WH-CH720N నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్. దీంతో మీరు బయటి గోలంతా బంద్ చేసి, కేవలం మ్యూజిక్‌నే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో డ్యుయల్ నాయిస్ సెన్సర్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ వీ1 ఉన్నాయి. దీంతో చుట్టూ ఉన్న అనవసరమైన సౌండ్స్‌ని హెడ్‌ఫోన్ ఫిల్టర్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఇది కింగే! ఒక్కసారి చార్జ్ చేస్తే, ఏకంగా 50 గంటల వరకూ పనిచేస్తుంది. యూఎస్బీ -సి చార్జింగ్ సపోర్ట్ ఉంది. హెడ్‌ఫోన్ తీయకుండానే బయటి మాటలు, అనౌన్స్మెంట్లు వినాలనుకుంటే.. యాంబియంట్ సౌండ్ మోడ్ ఆన్ చేయొచ్చు. ఇందులో 20 లెవెల్స్ సెట్ చేసుకోవచ్చు. డ్యుయల్ కనెక్టివిటీ సదుపాయం ఉంది. ఇందులో మైక్రోఫోన్స్, వాయిస్ పిక్-అప్ టెక్నాలజీ వల్ల హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ చాలా క్లియర్‌గా ఉంటుంది. అడాప్టివ్ సౌండ్ కంట్రోల్డ్ ఫీచర్ దీంట్లోని మరో ప్రత్యేకత. లొకేషన్ ఆధారంగా హెడ్‌ఫోన్ ఆటోమేటిక్‌గా వాల్యూమ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది.
ధర: రూ. 8,990
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్