మాంసాహార వంటకాల్లో ఒకదాన్ని మించి మరొకటి రుచిని పంచుతాయి. నాటుకోడి పులుసు ఘాటు గురించి చెప్పక్కర్లేదు. మటన్ బిర్యానీ వండితే వీధివీధంతా
దావత్కు రావాల్సిందే! అయితే, ఎన్ని రకాలున్నా చికెన్ 65 తర్వాతే మరేదైనా అంటారు ఆహార ప్రియులు. ఈ రకంలోనూ ఏ ప్రాంతానికి చెందినది గొప్పదో నిర్వహించిన ఓ సర్వేలో చెన్నై చికెన్ 65 పదో ర్యాంకులో నిలిచింది.
టేస్ట్ అట్లాస్ నిర్వహించిన గ్లోబల్ సర్వేలో చికెన్ 65 కింగ్ అనిపించుకుంది. 5 పాయింట్లలో 4.3 రేటింగ్ సాధించింది. ఈ జాబితాలో ఇండోనేసియాకు చెందిన ఫ్రైడ్ చికెన్ వెరైటీ ఆయమ్ గోరెంగ్ మొదటి ర్యాంకు కొట్టేసింది. తైవాన్ వంటకం పాప్కార్న్ చికెన్ రెండో స్థానంలో, అమెరికా ఫేమ్ సదరన్ ఫ్రైడ్ చికెన్ మూడో స్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో వరుసగా చైనా, ఉక్రెయిన్, ఇండోనేసియా, రష్యా, ఆస్ట్రియా, అమెరికా దేశాలకు చెందిన రకరకాల ఫ్రైడ్ చికెన్ పదార్థాలు నిలిచాయి. పదో స్థానాన్ని మన చికెన్ 65 సొంతం చేసుకుంది.