కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు: రెండు, చీజ్ తురుము: అర కప్పు, అంగుళం ముక్కలుగా కోసిన చీజ్: పావు కప్పు, తరిగిన ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, కొత్తిమీర: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, పచ్చిమిర్చి: రెండు, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఆరిగానో: అర టీస్పూన్ చొప్పున, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, బ్రెడ్ క్రంబ్స్: అర కప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ఆలుగడ్డలను ఉడికించి మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో ఆలుగడ్డ ముద్ద, తరిగిన ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిరియాల పొడి, చీజ్ తురుము, తగినంత ఉప్పు వేసి.. అన్నీ కలిసేలా కలపాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేతిలో ఒత్తి మధ్యలో చీజ్ ముక్క పెట్టి గుండ్రని ముద్దలా చేసుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి జారుగా కలపాలి. ముందుగా చేసిన ముద్దల్ని మైదా మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి వేడయ్యాక.. అప్పటికే చేసిపెట్టుకున్న వాటిని వేసి దోరగా వేయించుకుంటే వేడివేడి చీజ్ పొటాటో బాల్స్ సిద్ధం.