Plot vs Flat | ఫ్లాట్ కొనాలా.. ఇండిపెండెంట్ ఇల్లు కొనాలా? ఏది బెటర్?
Plot vs Flat | మేం హైదరాబాద్‌లో ఉంటున్నాం. నెలకు రూ.15 వేలు ఇంటి అద్దె కడుతున్నాం. మేము ఉంటున్న ఫ్లాట్‌ను యజమాని రూ.45 లక్షలకు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాడు. నా భర్త, అత్తామామలు మేమే కొంటే బాగుంటుందని అనుకుంటున్నారు. అయితే కొన్నేండ్లకు ఈ ఫ్లాట్ ధర పెరగొచ్చు లేదా తగ్గొచ్చు కూడా. ఇండిపెండెంట్ ఇల్లు అయితే భవిష్యత్‌లో తగ్గే ప్రసక్తే ఉండదని నా అభిప్రాయం. కాకపోతే మా బడ్జెట్లో ఇక్కడ ఇండిపెండెంట్ ఇల్లు వచ్చే అవకాశం లేదు. శివార్లలో ప్రయత్నించాలని అనుకుంటున్నాం. ఇండిపెండెంట్ ఇల్లు కొని అద్దెకు ఇవ్వడం మంచిదా? ఉంటున్న ఫ్లాట్‌నే కొనడం ఉత్తమమా?
– ఓ గృహిణి
జ: సొంతిల్లు తీసుకోవడమనేది పెద్ద తీర్మానం. లక్షల్లో డబ్బు సమకూర్చుకోవాలి. రుణాలు తీసుకుంటే.. వాటిని తీర్చడానికి ఏండ్ల సమయం పడుతుంది. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక స్తోమత, ఉద్యోగ భద్రత, రుణాలు తీర్చగల సామర్థ్యం.. ఇవన్నీ ఆలోచించాలి. చాలామంది తమ దగ్గర ఉన్న పొదుపు మొత్తంతో డౌన్‌పేమెంట్ జరిపి, మిగతాది లోన్ తీసుకుని ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ ఇల్లు కొంటారు. ఈమధ్య డౌన్‌పేమెంట్‌కు కూడా పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. ఇలా సంపాదన అంతా బ్యాంకు వాయిదాలకే కట్టడంవల్ల చాలా కుటుంబాలు తమ పిల్లల చదువు, రిటైర్మెంట్ సేవింగ్స్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాయి. జీవితంలో చాలా భాగాన్ని అప్పులతోనే గడిపేస్తున్నారు. అలాగే, అపార్ట్మెంట్ లేదా ఇండిపెండెంట్ ఇల్లు.. ఏది కొంటే మంచిదని మీరు అడిగారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉండటానికి సౌకర్యంగా ఉంటుంది. కానీ కొన్నేండ్లకు కట్టడం పాతదైపోయి, విలువ తగ్గిపోయే అవకాశం ఉంది. శివార్లలో అయినా సరే, ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోవడం మంచి ఆలోచనే. కాకపోతే అందులో ఉండాలని అనుకుంటేనే కొనాలి. లేదంటే, హెచ్ఎండీఏ ప్లాట్లు తీసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో లాభాలు పొందేందుకు ఇది ఉత్తమ మార్గం. వీటిలో మీకు అనువైన మార్గాన్ని ఎంచుకోండి. తొందరపాటు వద్దు. ఉచిత సలహాలూ తీసుకోవద్దు.
– దీప నిట్టల, చార్టర్డ్ వెల్త్ మేనేజర్, డైరెక్టర్, శ్రీమంత్రణ ఫైనాన్షియల్ సర్వీసెస్
Read More :
“ఆన్లైన్లో ఆఫర్స్ చూడగానే ఆగలేకపోతున్నా.. షాపింగ్ అలవాటు ఎలా మానేయాలి?”
పిల్లలు పుట్టాక నేను జాబ్ మానేసినా సమస్యలు రావద్దంటే ఏం చేయాలి?”
Gold | బంగారం కొనాలా?ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా?”
నా పేరు మీద ఉన్న ఆస్తిపై నా భర్తకు హక్కుఉంటుందా?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Advice
- flat
- plot
- real estate
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

