కుర్తా… అమ్మాయిల రోజువారీ జీవితంలో కీలకం. చీర… వాళ్ల లైఫ్‌లో గెస్ట్ రోల్. ఈ రెండూ ఒకేసారి ట్రై చేస్తే… కుర్తా శారీ. ఇదో ఫ్యూజన్ స్టైల్ అన్నమాట. కుర్తీలో ఉన్న కంఫర్ట్‌ను, చీరలో ఉన్న విభిన్నతను కలగలిపి దీన్ని తయారుచేశారు. సాధారణ కుర్తీలాగానే నిమిషంలో దీన్ని తొడుక్కోవచ్చు.
వీటిలో కొన్నిటికి పైన విడిగా కోట్ వేసుకునేలా వస్తే, మరి కొన్నిటికి నడుము దగ్గర పెట్టుకునేలా సన్నటి బెల్ట్‌లాంటిది ఉంటుంది. దీంతో షేప్ చక్కగా కనిపిస్తుంది. సింపుల్ జువెలరీ, ఫ్యాషనబుల్ చెప్పులు జోడిస్తే సరి… క్రేజీ స్టైల్ మీదే ఇక!