కుటుంబం ఆర్థికంగా బాగుండాలంటే దంపతులిద్దరూ ఒక్క మాటపై ఉండాలి. డబ్బు విషయంలో ఇద్దరి మనసులో పొదుపు చేయాలని ఉంటే, కచ్చితంగా ఆ కుటుంబానికి ఆర్థిక సమస్యలు రావు. అయితే ప్రణాళికలు ఎలా వేసుకోవాలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా కొత్తగా పెండ్లయిన దంపతులకు ఈ విషయంలో అవగాహన అంతంత మాత్రమే! అలాంటి వాళ్లు కొన్ని ఆర్థికపరమైన విషయాలు తెలుసుకుంటే మంచిది.