Barry Grater | కొంతమందికి వంటింటిని అందంగా సర్దుకోవడం ఇష్టం ఉంటుంది. అక్కడ వాడే వస్తువులన్నిటినీ ప్రత్యేకంగా కొనుక్కొని వరుసలో పెట్టుకుంటారు. అలాంటి చోట ఓ ముచ్చటైన బొమ్మ కూడా ఉంటే మరింత బాగుంటుంది కదూ! అలాంటి సరదా ఉన్న వాళ్లకోసం తయారు చేసింది బారీ గ్రేటర్.
ఎలుగుబంటి బొమ్మ ఆకృతిలో ఉండే దీని వెనుక తురమడానికి అనువుగా గ్రేటర్ ఉంటుంది. కొబ్బరి, క్యారెట్, బీట్రూట్లాంటివి ఏమైనా దీనితో తురుముకోవచ్చు. అదంతా బొమ్మ పొట్టలో ఉంటుందన్నమాట. దాన్ని తెరిచి తురుమును తీసుకోవచ్చు. ముచ్చటగా ఉన్న ఈ గ్రేటర్ మీకూ నచ్చిందా!