అతిమధురంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, చలికాలంలో వేధించే ఎన్నో సమస్యలకు.. ఈ ఔషధంతో చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యం కలిగిన అతిమధురం ప్రయోజనాలు, దానిని ఎలా వాడాలో వివరిస్తున్నారు.
ఆయుర్వేదంలో ఎక్కువ ఔషధ గుణాలు కలిగిన మూలికగా ‘అతిమధురం’ గుర్తింపు పొందింది. శ్వాసకోశ ఇబ్బందులు తగ్గించడంలో ఇది ముందుంటుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి మైక్రోబియల్ గుణాలు అధికం. ఇవి శీతాకాలంలో వేధించే దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ అతిమధురం వేర్లు సాయపడతాయి. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల రిస్కును తగ్గిస్తాయి. ఇక జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు నోటి ఆరోగ్యానికీ అతిమధురం భరోసా ఇస్తుంది. నోట్లో క్రిములను
అతిమధురాన్ని అనేక రకాలుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరును నేరుగానూ నమలవచ్చు. జలుబు, దగ్గు వేధిస్తుంటే.. అతిమధురం వేరు నమిలితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అతిమధురం వేరు, అల్లంతో తయారు చేసిన ‘టీ’ తాగితే.. గొంతు నొప్పి తగ్గుతుంది. దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, తులసి ఆకులు వేసి తయారుచేసిన అతిమధురం డికాక్షన్ తీసుకుంటే.. ఊపిరితిత్తుల సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు దూరమవుతాయి. అయితే, అతిమధురం ఏ మోతాదులో ఉపయోగించాలో వైద్యులను అడిగి తెలుసుకోవడం మంచిది.