సంక్రాంతికి పతంగులు ఎగురవేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

Sankranti Special Kites | సంక్రాంతి రోజుల్లో పతంగులు ఎగరేయడం తెలంగాణ సంప్రదాయం. అయితే, ఆటవిడుపుగా సాగాల్సిన ఈ వేడుక కృతకమైన మాంజా కారణంగా మనుషులు, పక్షుల ప్రాణాలమీదికి తెస్తున్నది. గత ఏడాది, సంక్రాంతి నాడు బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ మెడకు పతంగి మాంజా బిగుసుకుంది. దాంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదానికి మాంజానే కారణమైనా, బాధ్యత లేకుండా పతంగులు ఎగరేసే వారిని కూడా తప్పు పట్టాల్సిందే.

ఏటికేడాది మాంజా గాయాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేండ్ల క్రితం ఢిల్లీలో మాంజా కారణంగా ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆ సంఘటన తర్వాత స్థానికులు మాంజా వాడకానికి వ్యతిరేకంగా గళమెత్తారు. దాంతో ఢిల్లీ ప్రభుత్వం మాంజాను నిషేధించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) కూడా గతంలోనే, గాజు పూతపూసిన నైలాన్ లేదా సింథటిక్ చైనా మాంజాను అను మతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మాంజా అమ్మినవారికి, కొన్నవారికి ఒకటి నుంచి ఐదేండ్ల జైలుశిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా, లేదంటే రెండూ విధించేలా చట్టం చేసింది. ఇక తెగిపోయిన పతంగుల కోసం వీధుల్లో పరుగులు పెడుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న పిల్లలు అనేకమంది. పక్షుల పరిస్థితి మరింత దయనీయం. చాలావరకూ తెగిపోయిన పతంగుల దారాలు చెట్లకు, కరెంటు తీగలకు చుట్టుకుంటాయి. వాటి మీద కూర్చున్నప్పుడు అవి పక్షుల మెడలకు బిగుసుకుంటున్నాయి. దీంతో ఆ మూగ జీవాలు ఊపిరాడక చచ్చిపోతున్నాయి. ఈ సమస్యపై జంతు హక్కుల పోరాట సంస్థ ‘పెటా’కు ఏటా సంక్రాంతి సీజన్లో వేలాది ఫిర్యాదులు అందుతాయి. విద్యుత్ తీగలు, కేబుల్ టీవీ తీగలకు లోహపు పూత ఉన్న మాంజా చుట్టుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ ముప్పు పొంచి ఉంటుంది. గత ఏడాది బెంగళూరులో ఓ ఎనిమిదేండ్ల బాలుడు ఇలానే చనిపోయాడు. ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడంలో ప్రజలు కూడా తమవంతు పాత్ర పోషించాలి. మాంజా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పతంగుల పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోండి.
– డాక్టర్ దేవేందర్ సింగ్, సీనియర్ వాస్క్యులర్,
ఎండోవాస్క్యులర్ సర్జన్ యశోదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్
హైదరాబాద్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sankranthi festival | సంక్రాంతి పండుగకు ఇన్నిపేర్లున్నాయా..?
Sankranti Special | పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు?
పందెంకోడి లక్ష.. ఏపీలో సంక్రాంతి సందర్భంగా రేట్లకు రెక్కలు
Sankranti | సంక్రాంతికి సినిమా రాకపోయినా రాధే శ్యామ్ పతంగి వచ్చింది..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- china manja
- Kites
- manja
- sankranti
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

