కావలసిన పదార్థాలు
కూర అరటికాయలు: రెండు, పచ్చికొబ్బరి తురుము: అర కప్పు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు: అర టీస్పూన్, ఇంగువ: చిటికెడు, మినుప పప్పు, శనగ పప్పు: ఒక టీస్పూన్ చొప్పున, పసుపు: పావు టీస్పూన్, ఎండు మిర్చి: రెండు, పచ్చిమిర్చి: ఒకటి, అల్లం: అంగుళం ముక్క, ఉల్లిగడ్డ: ఒకటి, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, నిమ్మరసం: రెండు టీస్పూన్లు.
తయారీ విధానం
ముందుగా అరటికాయలను ఉడికించి పొట్టుతీసి సన్నగా తురుముకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక ఆవాలు, మినుప పప్పు, శనగ పప్పు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన అల్లం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. అన్నీ బాగా వేగాక అరటి తురుము, కారం, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు చల్లి మూతపెట్టి సన్నటి మంటపై అయిదు నిమిషాలపాటు మగ్గించాలి. చివరగా కొబ్బరి తురుము, నిమ్మరసం, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపితే వేడివేడి అరటి పొరటు సిద్ధం.