టెక్నాలజీ అంటే ప్యాషన్‌గా భావించే వాళ్లకు, యాపిల్ ప్రొడక్ట్స్ అంటే క్రేజ్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్! యాపిల్ తన ఐప్యాడ్ ఎయిర్ సిరీస్‌లో మరో అప్‌గ్రేడ్‌ను తీసుకొచ్చింది. అదే ఐప్యాడ్ ఎయిర్ M3. కొత్తగా విడుదలైన ఈ వెర్షన్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారింది. ప్రొఫెషనల్ వర్క్, క్రియేటివ్ టాస్క్స్, గేమింగ్.. ఇలా సూపర్‌ఫాస్ట్ ప్రాసెసింగ్‌కు ఇది బెస్ట్ చాయిస్! మీరు కంటెంట్ క్రియేటర్ అయితే.. హై-రిజల్యూషన్ వీడియో ఎడిటింగ్‌తో మరింత స్మార్ట్ వర్క్ చేయొచ్చు. డిజైనర్ అయితే.. గ్రాఫిక్స్‌తో ఆడుకోవచ్చు! గేమర్ అయితే లాగ్ లేకుండా హై-ఎండ్ గేమ్స్‌తో దుమ్ము లేపొచ్చు. ఇదంతా M3 చిప్ వల్లే! మునుపటి మోడల్స్‌తో పోలిస్తే మూడున్నర రెట్లు వేగవంతమైన ప్రాసెసింగ్ దీని సొంతం. ఆధునిక గ్రాఫిక్స్ టెక్నాలజీ, మెరుగైన మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలు ఈ డివైస్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయి. Apple Intelligence సపోర్ట్ ఉండనే ఉంది! రీడిజైన్ చేసిన ‘మ్యాజిక్ కీబోర్డ్‌తో దీన్ని ల్యాప్ట్యాప్లా వాడేయొచ్చు. లైట్ వెయిట్ కాబట్టి, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 11 అంగుళాలు, 13 అంగుళాల స్క్రీన్ సైజ్‌తో యాపిల్ దీన్ని అందిస్తున్నది. ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ బేసిక్ వెర్షన్ ప్రారంభ ధర రూ.34,900.