మొక్కకు చిక్కులు?
మొక్కలు పసిపాపలు. సమయానికి నీళ్లు పోయాలి. ఎండ నుంచి రక్షించుకోవాలి. ఆ ప్రేమకు పొంగిపోయి శాఖోపశాఖలుగా విస్తరిస్తాయా పచ్చని బుజ్జాయిలు.
మొక్కలు పసిపాపలు. సమయానికి నీళ్లు పోయాలి. ఎండ నుంచి రక్షించుకోవాలి. ఆ ప్రేమకు పొంగిపోయి శాఖోపశాఖలుగా విస్తరిస్తాయా పచ్చని బుజ్జాయిలు. అయితే, కొన్నిసార్లు మొక్క ఎదుగుదలలో తేడా కనిపిస్తుంది. ఆ లక్షణాలను గుర్తించి లోపాలను సరిదిద్దాలి.
- కొత్త ఆకులు వచ్చినప్పుడు పాతవి రాలిపోతాయి. అది సహజం. కానీ లేత ఆకులు కూడా ఉన్నపళంగా రాలిపోతుంటే మాత్రం జాగ్రత్తపడాలి.
- ఆకులు పచ్చబడిపోవడం కూడా ఏమంత మంచి మార్పు కాదు. కొన్నిసార్లు సూర్యకాంతి అతిగా తగలడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
- శిశిరంలో ఆకులురాలడం సహజమే. కానీ రుతువుకాని రుతువులో టపాటపా రాలిపోతున్నాయంటే.. మొక్కకు ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టే.
- ఆకులపై మచ్చలూ ఓ అవలక్షణమే. తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందనే హెచ్చరికే.
- మొక్క ఎదుగుదల ఆగిపోవడం కూడా అనుమానించాల్సిన సందర్భమే.
- ఆకులపై రంధ్రాలు, బూజును తలపించే ఫంగస్, పురుగుల జాడలు.. దేన్నీ విస్మరించలేం.
- కొన్నిసార్లు మొక్కల నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇది కూడా ఆహ్వానించదగిన పరిణామం కాదు.
- కొమ్మలు బలంగా ఉంటేనే మొక్క నిటారుగా నిలబడుతుంది. కొమ్మలు వాలిపోతున్నట్టు, వాడిపోతున్నట్టు అనిపిస్తే మాత్రం.. ప్రమాద సంకేతమే.
.. ఈ లక్షణాలలో ఏ కొన్ని కనిపించినా నిపుణుల సలహా తీసుకోండి. తగిన మందులు వాడండి. మొక్కను బతికించుకోండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

